Begin typing your search above and press return to search.

డిక్టేటేర్‌.. షూటింగ్‌ పూర్తయినట్లే

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:21 AM GMT
డిక్టేటేర్‌.. షూటింగ్‌ పూర్తయినట్లే
X
ల‌య‌న్ ఈజ్ బ్యాక్ ఎగైన్‌! బాల‌య్య‌బాబుకు సింహా - లెజెండ్ లాంటి మ‌రో హిట్టు కావాలి. కెరీర్ 100వ సినిమా ముంగిట ఉంది కాబ‌ట్టి ఘ‌న‌మైన విజ‌యంతో స్ర్టీమ్‌ లైన్‌ లో అడుగుపెట్టాలి. అందుకే ప్ర‌స్తుతం 99వ సినిమా -డిక్టేట‌ర్ కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు బాల‌య్య‌. అంత‌కు మించి హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్‌. ఎట్టి ప‌రిస్థితుల్లో బాల‌య్య‌బాబుకి అదిరిపోయే ఓ హిట్టివ్వాల‌న్న‌ది ఈ డైరెక్ట‌ర్ త‌ప‌న‌. లౌక్యం త‌ర్వాత మ‌రో హిట్టుకొట్టి త‌న హ‌వా చాటాల‌న్న‌ది శ్రీ‌వాస్ ఆలోచ‌న‌.

ఇప్ప‌టికే మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇటీవ‌లే ఢిల్లీ - హ‌ర్యానా ప‌రిస‌రాల్లో కీల‌క షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగించారు. అక్క‌డ‌ షెడ్యూల్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌ లో అడుగుపెట్టింది. ఈనెల 20న ఏపీ రాజ‌ధాని అమరావ‌తిలో ఘ‌నంగా ఆడియో వేడుక చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అమ‌రావ‌తికి శంకుస్థాప‌న చేశాక ఇదే మొద‌టి ఆడియో కావాల‌న్న‌ది బాల‌య్య అండ్ గ్యాంగ్ ఆలోచ‌న‌. రాజ‌ధాని వాసుల్నిసెంటిమెంటుతో కొట్టేందుకు రెడీ అవుతున్నారు. బోయ‌పాటి ఇచ్చిన‌ట్టు బాల‌య్య‌బాబుకు హిట్టిచ్చే ద‌మ్ము శ్రీ‌వాసుకి ఉందా? ఆ స్థాయి మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో సినిమా తీసే స‌త్తా ఉందా? అన్న‌ది డిక్టేట‌ర్ తేల్చేస్తుంది. అటుపై బాల‌య్య‌బాబు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో 100వ సినిమా `గాడ్‌ ఫాద‌ర్‌`లో న‌టించేందుకు రెడీ అవుతారు. అదీ సంగ‌తి.