Begin typing your search above and press return to search.

హృతిక్ కంటే బాలయ్యకే రేటింగ్ ఎక్కువ

By:  Tupaki Desk   |   20 Oct 2016 3:30 PM GMT
హృతిక్ కంటే బాలయ్యకే రేటింగ్ ఎక్కువ
X
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో.. లోకల్ మూవీ పోటీ పడ్డం సాధ్యమా? అది కూడా హృతిక్ రోషన్ లేటెస్ట్ మూవీ 'మొహెంజొదారో'ను వరల్డ్ టీవీ ప్రీమియర్ గా వేస్తే.. అంతకంటే ఎక్కువగా ఓ డబ్బింగ్ బొమ్మకు టీఆర్పీ రేటింగ్స్ రావడం సాధ్యమా? ఇంకెవరికైనా అసాధ్యమేమో కానీ.. నందమూరి బాలకృష్ణ మాత్రం దీన్ని సింపుల్ గా సుసాధ్యం చేసేశారు.

ఈ నెల 9న మొహెంజొదారోను స్టార్ గోల్డ్ లో టెలికాస్ట్ చేస్తే.. రూరల్ ఏరియాస్ లో 1511 రేటింగ్ వచ్చింది. అంతకు ముందు రోజున బాలయ్య నటించిన డిక్టేటర్ హిందీ వెర్షన్ 'యుద్ధ్ ఏక్ జంగ్'ను రిష్తే సినిప్లెక్స్ లో ప్రసారం చేయగా.. 1649 పాయింట్లు రేటింగ్ రావడం చెప్పుకోవాలి. ఈ ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన మొహెంజొదారోను మొదటిసారిగా ప్రసారం చేసిన ప్రీమయిర్ షో కంటే.. బాలయ్య డబ్బింగ్ బొమ్మకు రూరల్ లో రేటింగ్ ఈ రేంజ్ లో రావడం చాలామందికి షాక్ నిచ్చింది. ఇంతకంటే పెద్ద షాక్ ఏంటంటే.. ఈ కేటగిరిలో ఆ వారం టాప్ వన్ లో నిలిచింది బాలయ్య సినిమా.

ఈ డీటైల్స్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ నెట్వర్క్ లో తెగ సర్క్యులేట్ అయిపోతోంది. మా బాలయ్య పవర్ ఇదీ అనీ గర్వంగా చెప్పుకునే సందర్భాన్ని అస్సలు వదలడం లేదు ఫ్యాన్స్. ఈ లిస్ట్ లో గోపీచంద్ జిల్ 4వ ప్లేస్ లో ఉండడం గమనించాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/