Begin typing your search above and press return to search.

మహా మతలబు ఉంది

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:25 AM GMT
మహా మతలబు ఉంది
X
ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు అట్టే టైం లేదు. వచ్చే శుక్రవారం రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొదటిసారి బాలయ్య సినిమా ఆయన స్థాయి కంటే తక్కువ బజ్ తో వస్తోంది. కథానాయకుడు తాలూకు ప్రభావం ఆ రేంజ్ లో ఉంది మరి. దాని వల్ల వచ్చిన నష్టాలను భరించే విషయంలో బాలయ్య టీమ్ ఇచ్చిన ఫార్ములా ఊరట కలిగించేలా ఉన్నప్పటికీ అందులో ఉన్న మతలబు బయ్యర్లకు గుబులు తగ్గించకపోగా కొత్త టెన్షన్ ని ఇస్తోంది. అదేంటో చూడండి. విశ్వసనీయ సమాచారం మేరకు కథ ఈ విధంగా ఉంది. మొదటిభాగం నష్టాలు 33 శాతం భరిస్తాము అన్నారు కదా. అంటే ఇక్కడ దానర్థం మహానాయకుడు డిస్కౌంట్ కింద తగ్గించి తీసుకోమని కాదు. వేరే అర్థం ఉంది. ఇంకాస్త స్పష్టంగా అర్థం కావాలంటే ఇది ఓ లుక్ వేయండి.

ఏదయినా ఏరియా లేదా ప్రాంతం ఎన్టీఆర్ కథానాయకుడుని ఓ బయ్యర్ 10 కోట్లకు కొన్నాడు అనుకుందాం. వచ్చింది 20 శాతం అన్నారు కాబట్టి మహా అయితే 2 నుంచి 2.5 కోట్ల దాకా షేర్ వస్తే 8 కోట్ల నష్టం మిగిలింది. అందులో 33 శాతం అంటే 2 కోట్ల 40 లక్షలు. మహానాయకుడు షేర్స్ లో ముందు ఇది తీసుకోవాలి. రెండో కండీషన్ ప్రకారం మరో 40 శాతం తీసుకోవచ్చు. అంటే మహానాయకుడు ఎంత షేర్ తెస్తే అందులో నుంచి ఆదనంగా వస్తుందన్న మాట. అప్పుడు మిగిలింది ఎన్టీఆర్ నిర్మాతలకు కట్టాలి. కర్ర వాడకుండానే పామును బ్రతికించే ప్రయత్నం అన్నమాట.

ఇదంతా బ్లాక్ బస్టర్ అయితే వర్క్ ఔట్ అయ్యే వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా వరాలిచ్చిన బాలయ్యకు పేరు వస్తుంది కానీ బయ్యర్లకు నష్టాల శాతం తగ్గుతుందే తప్ప పైసా లాభం రాదు. ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ 10లో చేరితేనే ఎన్టీఆర్ కొన్నవాళ్ళు సేఫ్ అవుతారు. అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పిన ఏరియా బయ్యర్ గట్టెక్కాలి అంటే మహానాయకుడు 15 కోట్ల దాకా షేర్ ఇవ్వాలి. అదంత ఈజీ కాదని అతనికీ తెలుసు

ఇంత లోతుగా అన్ని కోణాల్లో ఆలోచించే బాలయ్య బృందం ఈ ఫార్ములా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మహానాయకుడు బ్లాక్ బస్టర్ అయితే తప్ప డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డున పడేందుకు వేరే మార్గం లేదు. సినిమా వ్యాపారం అంటేనే జూదం లాంటిది కాబట్టి ఏదైతే ఆదయ్యింది చూద్దాం అని రెడీ అయ్యారు బయ్యర్లు. ఈ చిక్కుముడి అందరిని గట్టెక్కిస్తుందా లేదా తేలాలంటే 22 దాకా వేచి చూడాలి