డైరెక్టర్లపై బాలయ్య మనసులోని మాట ఇదే!

Wed Jan 11 2017 11:01:26 GMT+0530 (IST)

టాలీవుడ్ టాప్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ... ముక్కుసూటి మనిషిగానే మనకందరికీ తెలుసు. సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్న బాలయ్య... తన మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరనే చెప్పాలి. అది ఏ అంశమైనా కావచ్చే. బాలయ్య తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టేసినట్లుగానే చెబుతారు. తాజాగా తన వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోని డైరెక్టర్ల మనస్తత్వాలపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. శాతకర్ణి దర్శకుడు క్రిష్ ను ఆకాశానికెత్తేసిన బాలయ్య... ఇండస్ట్రీలోని కొందరు  డైరెక్టర్ల పై పంచ్ లేశారు. క్రిష్ ను ఒరిజినల్ డైరెక్టర్ గా అభివర్ణించిన బాలయ్య... టాప్ డైరెక్టర్లలో కొందరిని అబద్దాల కోరులుగా తేల్చేశారు.

డైరెక్టర్ల వ్యవహారంపై బాలయ్య చేసిన కామెంట్లను ఓ సారి పరిశీలిస్తే... ‘‘క్రిష్ తో నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఆయన ఇదివరకు తీసిన ఐదు సినిమాల్లో ఒకదానికి ఇంకోదానికి పోలిక ఉండదు. అంత వైవిధ్యమైన సినిమాలు తీశాడు. నేను అతణ్ని స్పీల్ బర్గ్ తో పోలుస్తాను. స్పీల్ బర్గ్ తీసిన సినిమాలకు ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. అంతటి కెపాసిటీ ఉన్న దర్శకుడు క్రిష్. తెలుగులో చాలా మంది దర్శకుల సంగతి నాకు తెలుసు. వాళ్లలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ల జబ్బేంటంటే.. ఒకే రకమైన సినిమాలు చేస్తుంటారు. ఒకే హీరోని పట్టుకొని చేస్తుంటారు. కానీ వేరే వాళ్ల కోసం రాసిన కథల్ని పట్టుకుని నా దగ్గరికొచ్చి.. మీ కోసమే ఈ కథ రాశామని చెబుతుంటారు. నాకు తెలుసు.. అదెవరి కోసం తయారుచేశారో. వాళ్లు రిజెక్ట్ చేసింది తీసుకొచ్చి నాకు చెబుతారు. అలాంటి సినిమాల్ని నేనెందుకు చేస్తాను?’’ అని బాలయ్య వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/