Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ రచ్చ.. దటీజ్ బాలయ్య!!

By:  Tupaki Desk   |   6 Jan 2017 7:31 PM IST
రిలీజ్ డేట్ రచ్చ.. దటీజ్ బాలయ్య!!
X
సంక్రాంతికి ఏ సినిమా ఎప్పుడొస్తుంది అనే విషయం ఇప్పటివరకు క్లారిటీలేదు అనుకుంటున్న సమయంలో.. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమాను జనవరి 12న తెచ్చేస్తున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించేశాడు దర్శకుడు క్రిష్‌. కాకపోతే ముందుగా అదే డేటుకు ఖైదీ నంబర్ 150 సినిమా వస్తుందని అన్నారు. ఇప్పుడు ఖైదీ 11న వస్తుందా లేదా 13న వస్తుందా.. లేదా అదే తేదీన వస్తుందా అనుకుంటున్న సమయంలో బాలయ్య 12న వస్తున్నారు కాబట్టి మేం రిలీజ్ డేట్ మార్చుకుంటాం అంటూ జనవరి 11ను ప్రకటించాడు రామ్ చరణ్‌.

అయితే ఈ రిలీజ్ డేట్లు కొందరు ఫ్యాన్స్ కు ఏమాత్రం డైజస్ట్ అవ్వలేదు. బాలయ్యతో పోటో లేకపోతే ఎలా.. ఇది సూపర్బ్ వార్ ఎపిసోడ్ అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ సినిమాను 12న రిలీజ్ చేయాలని సోషల్ సైట్లలో రచ్చ చేస్తే.. అలాగే నందమూరి ఫ్యాన్స్ కొందరు శాతకర్ణిని కూడా 11నే రిలీజ్ చేయాలని పట్టుబడుతూ నానా రభసా చేశారు. నిజానికి ఈ రెండు సినిమాలూ కూడా డబ్బులు పెట్టిన రామ్ చరణ్‌ (ప్రొడ్యూసర్ మనోడేగా) అండ్ క్రిష్‌ (ఆయన తండ్రి మరియు స్నేహితులే నిర్మాతలు)లకు తమ డబ్బు ఎలా వెనక్కి వస్తుంది అనేదే మెయిన్ గోల్ కాని.. ఇలా సంక్రాంతి పుంజుల్లా కొట్టుకుందాం అనుకుంటారేంటండీ?

విచిత్రం ఏంటంటే కొందరు సీనియర్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ మార్చాలంటూ ఏకంగా బాలయ్యను ఎప్రోచ్ అయ్యారట. ఆయన చాలా సింపుల్ గా ఏమన్నారంటే.. ''మన సినిమా 12న అని చెప్పేశాంగా!! వారు 11న వస్తున్నారు. ఓకె. ఇంకేముంది అందులో?? సినిమా బాగా వచ్చింది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పి వెంటనే కారెక్కేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. దటీజ్ బాలయ్య అంటున్నారు సిన్సియర్ అభిమానులు అందరూ. జనాలను ఎంటర్టయిన్ చెయ్యడమే హీరో పని కాని ఫ్యాన్ వార్స్ ప్రోత్సాహించడం కాదు. అదే ఆయన ఇన్ డైరక్టుగా చెప్పారు. కాదంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/