Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్‌ కన్ఫామ్‌ చేసిన బాలయ్య

By:  Tupaki Desk   |   29 April 2016 2:12 PM GMT
రిలీజ్ డేట్‌ కన్ఫామ్‌ చేసిన బాలయ్య
X
అయితే ఒకప్పుడు మాత్రం ఒక పండుగకు నాలుగైదు స్టార్లు బాక్సాఫీస్‌ దగ్గర కొట్టుకోవడం అనేది సాంప్రదాయం. ఇప్పుడు మాత్రం.. ముందే ఒకరికి ఒకరు తమ రిలీజ్ డేట్లను చెప్పేసుకొని.. వారం గ్యాప్‌ తో సినిమా రిలీజ్‌ ప్లాన్‌ చేసుకోవడం ఆనవాయితీ. అందుకేనేమో.. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించేశారు.

ఇప్పటికే 2017 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కూడా రేసులో ఉంటుందని టాక్‌ వచ్చేయడంతో.. ఒక అడుగు ముందుకేసి తన సినిమా రిలీజ్‌ తేదీని ప్రకటించేశారు బాలయ్య. జూన 12, 2017న తన ''గౌతమపుత్ర శాతకర్ణి'' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వనుంది ఈరోజు అధికారికంగా ప్రకటించేశారు కూడా. ఇప్పుడు బాల్‌ చిరంజీవి కోర్టులో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ వారు కూడా తమ తేదీని ప్రకటిస్తారా? ఇదే తేదీన వస్తారా లేకపోతే వారం గ్యాప్‌ ఇస్తారా?

ఏదేమైనా.. చిరంజీవి 150వ సినిమా సంక్రాంతికి రావడం పెద్ద గ్రేట్‌ కాదు. ఎందుకంటే అది మామూలు కమర్షియల్‌ సినిమా కాబట్టి.. చిరంజీవి ఎలాగో రీటేకులు వంటివి తీసుకోరు కాబట్టి.. ఫాస్టు ఫాస్టుగా షూటింగ్ ముగుస్తుంది. కాని బాలయ్య 100వ సినిమా మాత్రం పూర్తిగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ మయం. అంతా కంప్యూటర్‌ జాదూగాళ్ళ చేతిలోనే ఉంటుంది. మరి వీరు చెప్పిన టైముకు రావడం అనేదే ఇప్పుడు ఛాలెంజ్‌.