Begin typing your search above and press return to search.

బాల‌య్య మ‌రీ ఇంత ఆగ్ర‌హంగా ఉంటారా?

By:  Tupaki Desk   |   22 Jun 2017 9:50 AM GMT
బాల‌య్య మ‌రీ ఇంత ఆగ్ర‌హంగా ఉంటారా?
X
టెక్నాల‌జీ చేతికి అంది వ‌చ్చిన నేప‌థ్యంలో ఎవ‌రు ఎక్క‌డైనా ఏదైనా వీడియో తీసేస్తున్నారు. మొబైల్ ఫోన్లు ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లో ఉన్న నేప‌థ్యంలో.. కెమేరాక‌న్ను వెంటాడుతూనే ఉంటోంది. ప్ర‌ముఖ‌ల విష‌యంలో ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉంటోంది. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణకు చెందిన ఒక వీడియో యూట్యూబ్‌ లో అప్ లోడ్ అయ్యింది.

ఇందులో అభిమానుల ప‌ట్ల బాల‌కృష్ణ ఆగ్ర‌హంగా మాట్లాడ‌టం.. తిట్ట‌టం లాంటివి ఉన్నాయి. దాదాపు ఒక‌టిన్న‌ర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో.. అభిమానుల‌తో బాల‌య్య ఫోటోలు దిగుతుంటారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌తో ఫోటోలు దిగే వారి మీద క‌స‌రుకోవ‌టం.. మీ వాళ్లు కాకుంటే చెప్పండి అంటూ చెప్ప‌టం.. తూతూ మంత్రంగా ఫోటోల కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌టం క‌నిపిస్తుంది. ఫోటోల‌కు ఫోజులిస్తున్న మొత్తం స‌మ‌యం చిర్రుబుర్రులాడుతున్న బాల‌య్య క‌నిపిస్తారు. వాయిస్ క్లారిటీగా లేక‌పోవ‌టం.. వీడియో క్వాలిటీ కూడా స‌రిగా లేక‌పోవ‌టంతో.. ఈ వీడియో ఎప్పుటిది అన్న సందేహం క‌లుగుతోంది. బాల‌కృష్ణ రూడ్ బిహేవియ‌ర్ పేరుతో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో ఎప్పుడు.. ఎక్క‌డ తీశార‌న్న దానిపై స‌మాచారం అంద‌టం లేదు. యూట్యూబ్‌ లో హ‌డావుడి చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బాల‌య్య మ‌రీ ఇంత ఆగ్ర‌హంగా ఉంటారా? అన్న సందేహం క‌లిగేలా వీడియో ఉండ‌టం గ‌మ‌నార్హం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/