Begin typing your search above and press return to search.

నాగార్జున-బాలయ్య.. నరనారాయణ

By:  Tupaki Desk   |   11 Dec 2017 9:38 AM GMT
నాగార్జున-బాలయ్య.. నరనారాయణ
X
నందమూరి బాలకృష్ణ.. అక్కినేని నాగార్జున ఒకప్పుడు మంచి మిత్రులు. ఎన్టీఆర్-ఏఎన్నార్ తరహాలోనే వీరు కూడా తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలుండేవి. ఐతే ఏమైందో ఏమో.. మధ్యలో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు దూరమయ్యారు. ఏఎన్నార్ చనిపోయినపుడు కూడా బాలయ్య ఆయన చివరి చూపు కోసం రాలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అంతరం మరింత పెరిగింది. ఐతే కొన్ని నెలల కిందట టి.సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన అవార్డుల వేడుకలో ఇద్దరూ కలిశారు. తమ మధ్య విభేదాలేమీ లేవని చాటుకున్నారు. ఇప్పుడేమో నంది అవార్డుల వివాదంతో మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపించాయి.

ఇదిలా ఉంటే బాలయ్య-నాగార్జున కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘నర నారాయణ’ పేరుతో బాలయ్య-నాగ్ కలయికలో పౌరాణిక చిత్రం తీసేందుకు సీనియర్ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి నవావధాని మీగడ రామలింగయ్య స్వామి రచన చేస్తున్నారట. పుండరీకాక్షయ్య కోరిక మేరకు తాను ఈ సినిమాకు స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు రామలింగయ్య తెలిపారు. ఈ కథను బాలయ్యకు కూడా వినిపించామని.. ఆయన సానుకూలంగానే స్పందించారని కూడా ఆయన చెప్పారు. కానీ వ్యక్తిగతంగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో బాలయ్య-నాగ్ కలిసి సినిమా చేస్తారా.. అది కూడా పౌరాణిక చిత్రానికి ఓకే చెబుతారా అన్నది సందేహం. చూద్దాం మరి ఏమవుతుందో?