Begin typing your search above and press return to search.

#NBK105: లాంచ్ డేట్ ఫిక్స్ అయిందోచ్

By:  Tupaki Desk   |   18 Feb 2019 6:57 AM GMT
#NBK105: లాంచ్ డేట్ ఫిక్స్ అయిందోచ్
X
ఒకవైపు నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు బాలయ్య తదుపరి చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాలయ్య తన నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన బోయపాటి ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను లాంచ్ చేసేందుకు ఫిబ్రవరి 22 తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారట. సినిమా లాంచ్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్తారట. కానీ ఏప్రిల్.. మే నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హాడావుడి ఉంటుంది కాబట్టి బాలయ్య షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుంటారట. ఎన్నికల తర్వాత మళ్ళీ ఫిలిం యూనిట్ తో జాయిన్ అవుతారట. ఈ సినిమాను 2020 సంక్రాంతి సీజన్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

NBK ఫిలిమ్స్ బ్యానర్ పై బాలయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారట. బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'సింహా'.. 'లెజెండ్' సినిమాలు సూపర్ హిట్లు కావడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.