కుంభకోణంలో బాలయ్య

Tue Sep 12 2017 13:17:20 GMT+0530 (IST)

బాలయ్య వంద చిత్రాల మార్క్ ను దాటగానే పూనకం వచ్చినట్టుగా సినిమాలను ఒకే చేసేస్తున్నాడు. కథ నచ్చితే సక్సెస్ దర్శకుడా కాదా అని ఏ మాత్రం చూడటం లేదు. తనకు కాన్సెప్ట్ నచ్చితే ప్రొసీడ్ అయిపోవాల్సిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇన్నిరోజులు కెరీర్ ను ఓ లెవెల్ లో సెట్ చేసుకుంటూ వచ్చినా బాలయ్య ఇప్పుడు కూడా అదే తరహాలో వెళుతున్నాడు. ఏ మాత్రం స్పీడ్ తగ్గనివ్వకుండా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తున్నాడు.

రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాను అంతగా ఆడకపోయినా బాలకృష్ణ స్టైల్ మాత్రం సూపర్బ్ అంటున్నారు. ఎప్పుడు చూడని విధంగా ఆ సినిమాలో బాలయ్య దర్శనం ఇవ్వడంతో అభిమానులకు ఇంకాస్త దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు అభిమానులకు కోసం మళ్లీ తన స్టైల్ లో ఓ చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు. తమిళ్ డైరెక్టర్ కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను చేస్తున్నాడు. అయితే సినిమా లొకేషన్స్ పరంగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో చిత్రీకరణ జరిపిన దర్శకుడు ఇప్పుడు తమిళనాడులోని కుంభకోణం కు షిఫ్ట్ చేస్తడట.

24 రోజులవరకు చిత్ర యూనిట్ మొత్తం అక్కడే ఉంటారట. బాలయ్యతో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలతో పాటు ఇతర నటీనటులతో కొన్ని సీన్స్ ని తీయనున్నారట. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ -బ్రహ్మనందం తో పాటు బాలయ్య లక్కీ హీరోయిన్ నయనతార కూడా పాల్గొననుందట. కథాపరంగా కొన్ని తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలట దీంతో దర్శకుడు చెన్నై కుంభకోణం లో భారీ సెట్ ని వేయించి అక్కడే షూటింగ్ ప్లాన్ చేయించాడట. ఇక ఈ సినిమాకు జయసింహ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.  బాలయ్య ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగనున్నాడు.