ఆగస్ట్ 3న బాలకృష్ణ 102 ఓపెనింగ్

Mon Jul 17 2017 15:41:48 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో నందమూరి అభిమానుల్ని మెప్పించిన బాలయ్య ఆ వెంటనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించేందుకు అంగీకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వేడి తగ్గక ముందే పూరీ ఈ ప్రాజెక్ట్ కి పైసా వసూల్ అని పేరు పెట్టేయడం అంతే వేగంగా షూటింగ్ ను దాదాపు చివరి దశకి తీసుకురావడం జరిగిపోయాయి. ప్రస్తుతం బాలయ్య పైసా వసూల్ కి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం.

అయితే పైసా వసూల్ ఇంకా ఓ కొలిక్కి రాకుండానే బాలయ్య 102వ సినిమాకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ - బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఓపినింగ్ ఆగస్ట్ 3న ఖరారైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి జోరు మీదున్న బాలయ్య ముందుగా పైసా వసూల్ ఆ తరువాత 102వ సినిమా ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో ట్రీట్ ఇవ్వబోతున్నాడో చూద్దాం.