చిరు పాట నుంచి బాలయ్య టైటిల్

Mon Mar 20 2017 21:43:33 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం మొదలుపెట్టేశారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్నఈ  చిత్రం.. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేసుకుంది. త్వరలో యూరోప్ టూర్ కూడా వెళ్లనున్నారు టీం అంతా. అయితే.. ఇప్పుడు బాలయ్య మూవీ టైటిల్ విషయంలో పూరీ ఓ క్లారిటీకి వచ్చేశాడట.

సహజంగా పూరీ జగన్నాధ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగాను.. సింపుల్ గాను ఉంటాయి. అలాగే వెరైటీగా కూడా ఉంటాయి. అలా టైటిల్ తోనే సగం ఆకర్షించేసే పూరీ జగన్నాథ్.. బాలకృష్ణ చిత్రానికి "టపోరి" అనే పైరు సూచించాడట. వినగానే బాలయ్యకు కూడా ఈ పేరు నచ్చేసిందని తెలుస్తోంది. అయితే.. ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా పునరాలోచించుకోవడానికి కారణం ఏంటంటే.. ఈ పేరు వినగానే.. చిరంజీవి సినిమాలోని పాట గుర్తుకు వస్తుండడమే.

రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలో టపుటపు టపోరీ అనే పాట ఉంటుంది. అప్పట్లో ఈ పాట ఛార్ట్ బస్టర్ కూడా. టపోరి అనగానే ఆ పాట గుర్తుకొచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయ్ కాబట్టే.. ఇంకా మాటలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/