Begin typing your search above and press return to search.

చిరు వెర్సస్ బాలయ్య.. అవసరమా?

By:  Tupaki Desk   |   1 May 2016 5:30 PM GMT
చిరు వెర్సస్ బాలయ్య.. అవసరమా?
X
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండు సినిమాలు వారం వ్యవధిలో ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. తెలుగు సినిమాలో హీరోయిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన అగ్ర నటులు చిరంజీవి.. బాలకృష్ణ.. తమ కెరీర్లో మైలురాయి అనదగ్గ సినిమాలకు శ్రీకారం చుట్టారు. బాలయ్య వందో సినిమా.. చిరంజీవి 150వ సినిమా రెండూ అత్యంత ఆసక్తి రేపుతున్నవే. ఐతే ఈ ప్రెస్టీజియస్ మూవీస్ ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు దిగుతాయన్న వార్తే జనాలకు అంతగా రుచించట్లేదు. ఇవి రెండూ కూడా మోస్ట్ అవైటెడ్ మూవీస్. వీటికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాలయ్య వందో సినిమాకు కుదిరిన కాంబినేషన్.. దాని కథాంశం చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. మామూలుగా సినిమాలు చూడని ప్రేక్షకులు సైతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వందో సినిమాగా బాలయ్య ఛాయిస్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులకు సైతం ఈ సినిమా మీద ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఏడెనిమిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి సినిమాల్లోకి పునరాగమనం చేస్తుండటంతో ‘కత్తిలాంటోడు’ మీద కూడా విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాను ఏలిన చిరు.. ఇంత విరామం తర్వాత తెరమీద ఎలా కనిపిస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.

కాబట్టి ఈ రెండు సినిమాలూ వేర్వేరు సమయాల్లో రిలీజైతే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. రెండూ ఒకేసారి తలపడటం వల్ల దేనికీ మంచిది కాదు. ఏ ఒక్కదానికీ అనుకున్న స్థాయిలో హైప్ రాదు. కలెక్షన్లూ రావు. మీడియా కవరేజీ విషయంలోనూ ఇబ్బందే. అలా కాకుండా వేర్వేరు సమయాల్లో రిలీజైతే నేషనల్ లెవెల్లో ఆయా సినిమాలు చర్చనీయాంశమవుతాయి. అన్ని రకాలుగా రెండు సినిమాలకూ మంచే జరుగుతుంది. ఈ విషయం ఆలోచించి మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకుంటే బెటర్.