Begin typing your search above and press return to search.

బాహుబలి కంటే మెట్టు పైనే..

By:  Tupaki Desk   |   1 Aug 2015 1:57 PM GMT
బాహుబలి కంటే మెట్టు పైనే..
X
బాహుబలి రికార్డుల మానియా కొనసాగుతోంది. ఈ సినిమా అన్ని హిందీ సినిమాల రికార్డుల్ని బద్ధలు కొడుతూ ఛార్ట్‌ లో పైపైకి ఎగబాకుతోంది. అయితే రికార్డుల్లో సల్మాన్‌ భజరంగి బాహుబలి కంటే ఓ మెట్టు పైనే కనిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రాస్‌ కలెక్షన్ల లో ప్రపంచంలోనే టాప్‌ 25 సినిమాలేవి? అని ఆరాతీస్తే తెలిసిన సంగతులివి..

ఇంతవరకూ టాప్‌-1 గ్రాసర్‌ (లైఫ్‌ టైమ్‌)గా అమీర్‌ ఖాన్‌ నటించిన పీకే రికార్డులకెక్కింది. పీకే వసూళ్లు దాదాపు 730కోట్లు. ఈ రికార్డును ఇంకా బాహుబలి అధిగమించాలంటే చాలా టైమ్‌ పడుతుంది. ఫుల్‌ రన్‌ పూర్తయ్యాక కానీ చెప్పలేం. ధూమ్‌ - 3 తెలుగు, తమిళ్‌, హిందీ లో సాధించిన గ్రాస్‌ 540కోట్లు. ఆ తర్వాత భజరంగి భాయిజాన్‌ 14రోజుల్లో 495కోట్ల గ్రాస్‌ తో మూడో స్థానంలో నిలిచింది. 21రోజుల్లో 468కోట్ల వసూళ్ల తో బాహుబలి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్ని పరిశీలిస్తే....

3ఇడియట్స్‌ 395కోట్లు, చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ 393కోట్లు, కిక్‌ 360కోట్లు, హ్యాపీ న్యూ ఇయర్‌ 345కోట్లు, ఏక్‌ థా టైగర్‌ 308కోట్లు, క్రిష్‌ 3 -307కోట్లు, యే జవానీ హై దివానీ 298కోట్లు, రోబో 289కోట్లు, బ్యాంగ్‌ బ్యాంగ్‌ 280కోట్లు, దబాంగ్‌ 249కోట్లు, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ 240కోట్లు, ఐ 239కోట్లు, బాడీగార్డ్‌ 233కోట్లు, సింగం రిటర్న్స్‌ 220కోట్లు, దబాంగ్‌ 219కోట్లు, రా-వన్‌ 213కోట్లు, జబ్‌ తక్‌ హై జాన్‌ 210కోట్లు, డాన్‌ 2 -208కోట్లు, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌ 206కోట్లు, రామ్‌ లీల 202కోట్లు, రౌడీ రాధోర్‌ 198కోట్లు వసూలు చేశాయి.