Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: భైరవ.. ఇదొక మాస్ రచ్చ

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:14 AM GMT
టీజర్ టాక్: భైరవ.. ఇదొక మాస్ రచ్చ
X
ఇలయదళపతి విజయ్ నటిస్తున్న 60వ చిత్రం భైరవ. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఇప్పటి నుంచే హంగామా స్టార్ట్ చేసేశారు. 2017 సంక్రాంతికి భైరవను రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడీ మూవీకి టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అదరకొట్టగా.. ఇప్పుడు టీజర్ లో మాత్రం ఫుల్ మాస్ రచ్చ చూపించేశారు.

ఫస్ట్ ఫ్రేమ్ లోనే ఓ రౌడీని రెండు రౌండ్లు తిప్పి నేలకేసి కొట్టడం.. క్లాస్ లుక్ ఉన్న మాస్ విలన్ గా జగపతి బాబు ఇంట్రడక్షన్.. వరుసగా విజయ్ స్టైలింగ్.. ఫైట్లు చూస్తుంటే ఫ్యాన్స్ సంబరాలు చేసేసుకునేలా పర్ఫెక్ట్ గా టీజర్ కట్ చేశారనే విషయం అర్ధమవుతుంది. ఇక టీజర్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా రివీల్ చేశారు. సాంప్రదాయ తమిళ అమ్మాయి లుక్స్ తో సూపర్బ్ గా ఉంది. తొలిసారిగా పెద్ద స్టార్ తో సినిమా చేస్తుండడంతో.. ఆ మేరకు విజయ్ మేనరిజమ్స్ కు దగ్గరగా ఉండేందుకు కూడా ట్రై చేసింది.

భైరవలో విజయ్ డ్యుయల్ రోల్స్ చేస్తుండగా.. ఇప్పటివరకూ ఒక లుక్ మాత్రమే బయటకొచ్చింది. ఇప్పుడు కూడా ఆ లుక్ తోనే టీజర్ ఇచ్చారు. రెండో గెటప్ లో విజయ్ గుండుతో కనిపిస్తాడనే టాక్ ఉంది. ఆ రోల్ కి ఓ హీరోయిన్ కూడా ఉంటుందట కానీ.. ఇప్పటివరకూ ఆ పాత్ర ఎవరు చేస్తారో రివీల్ చేయలేదు. ఆడియన్స్ కోసం భైరవ యూనిట్ బోలెడన్ని సస్పెన్సులు సిద్ధం చేసి ఉంచినట్లుగా కనిపిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/