Begin typing your search above and press return to search.

ఎర్లీ రిపోర్ట్: బాహుబలి మూవీ టాక్

By:  Tupaki Desk   |   27 April 2017 7:17 PM GMT
ఎర్లీ రిపోర్ట్: బాహుబలి మూవీ టాక్
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి మొదటి ఆట పడింది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ టాక్ బయటికి వస్తోంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. ప్రభాస్, అనుష్క ఎలా చేశారు? బాహుబలి వన్ కంటే బాగుందా.. ప్రేక్షకుల అంచనాలు అందుకుందా...? ఓ ఆంగ్ల మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఆ హాట్ హాట్ లేటెస్ట్ అప్ డేట్స్ మీ కోసం.

అంచనాలకు మించిన హైప్ తో.. భారీ హడావుడి మధ్య.. రాజమౌళి చెక్కిన బాహుబలి ద కన్ క్లూజన్ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క నటన.. విజువల్ ఎఫెక్ట్స్ పై.. జనంలో పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ తప్ప మరే హీరో కూడా బాహుబలి చేయలేడన్నంతగా యంగ్ రెబల్ స్టార్ పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అతనికి పోటీగా.. దేవసేన అనుష్క కూడా.. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా.. ఆన్ స్క్రీన్ లో.. అదుర్స్ అనిపిస్తోంది. ఇక.. రెండేళ్లుగా జవాబు దొరకని... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకూ.. రాజమౌళి చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. స్క్రీన్ ప్లే కూడా తనే రాసుకున్న రాజమౌళి.. బాహుబలిలో కట్టప్ప ఎపిసోడ్ ను చాలా బ్యాలెన్స్ డ్ గా హాండిల్ చేశాడు.

ఇక్కడి వరకూ బానే ఉంది. ఇక.. సినిమాకు ప్రాణాధారమైన విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వద్దాం. ఈ విషయంలోనే.. రాజమౌళి అంచనాలను అందుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ దాదాపు.. బాహుబలి, దేవసేన ప్రేమకథ పై కాన్సన్ ట్రేట్ చేసిన జక్కన్న.. సెకండ్ హాఫ్ వచ్చేసరికి.. వార్ సీన్స్ పై దృష్టి పెట్టాడు. బాహుబలి వన్ లో.. ఇదే విజువల్ ఎఫెక్ట్స్ తో.. అదుర్స్ అనిపించిన జక్కన్న.. రెండో పార్ట్ వచ్చేసరికి మాత్రం మొదటి పార్ట్ అంత లేదు అనిపిస్తుంది అట. ఈ విషయాల్లో కాస్త నిరాశే మిగిలింది. కాస్త సాగదీసినట్టుగా ఎడిటింగ్ ఉందనీ.. పాటలు, బ్యాక్ గ్రౌండ్ చాలా నార్మల్ ఉన్నాయని ఆ ఆంగ్ల మీడియా రిపోర్ట్ చెబుతోంది.

బాహుబలి ద కన్ క్లూజన్ పై.. తుపాకి.. స్పెషల్ రివ్యూ మరికొన్ని గంటల్లో.. మీ ముందుంటుంది.