Begin typing your search above and press return to search.

ఆ వెబ్ సైట్ ఒప్పుకుంటేనే సెన్సార్

By:  Tupaki Desk   |   1 March 2017 6:05 PM GMT
ఆ వెబ్ సైట్ ఒప్పుకుంటేనే సెన్సార్
X
అసలు మన దేశంలో సెన్సార్ బోర్డుకు పంకజ్ నిహ్లాని అధ్యక్షుడు అయ్యాక.. ఎప్పుడు ఏ కారణంతో ఏ సినిమాకు ఎందుకు సర్టిఫికేట్ తిరస్కరిస్తారో అర్ధంకాకుండా పోతోంది. మొన్ననే లిప్ స్టిక్ అండర్ బుర్ఖా అనే సినిమాలో ఫోన్ సెక్స్ సీన్లు ఉన్నాయని చెప్పి ఏకంగా ఇంటర్నేషనల్ గా అవార్డులు వచ్చిన సినిమా అని కూడా చూడకుండా సర్టిఫికేట్ నిరాకరించారు.

కట్ చేస్తే ఇప్పుడు ''బద్రినాథ్‌ కి దిల్హానియా'' అనే సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక అబ్జెక్షన్ చెప్పారు. అవును.. ఏకంగా కరణ్‌ జోహార్ నిర్మాణంలో వరుణ్‌ దావన్ అండ్ ఆలియా భట్ నటించిన ఈ సినిమాకు సర్టిఫికేట్ ఆపారు. రీజన్ ఏంటో తెలుసా మాష్టారూ? ఈ సినిమాలో చాలాసార్లు ''షాది.కామ్'' అనే వెబ్ సైట్ పేరును వాడేశారట. పైగా విజువల్స్ కూడా చూపించారట. మరి ఆ వెబ్ సైట్ వారికి మీరు వారిని ఇలా వాడేసుకోవడంలో ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసురమ్మని చెప్పింది సెన్సార్ బోర్డు.

ప్రస్తుతం ఈ కొత్త ట్విస్టుతో తలగోక్కుంటున్న బద్రినాథ్‌ కి దుల్హనియా టీమ్.. మార్చి 10న రిలీజ్ కు అవాంతరాలు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది. లెటజ్ సీ.