Begin typing your search above and press return to search.

నా జీవితంలో అవి చీకటి రోజులు

By:  Tupaki Desk   |   11 Dec 2018 10:03 AM GMT
నా జీవితంలో అవి చీకటి రోజులు
X
హాలీవుడ్‌ ను అమెరికా ఇతర దేశాల హీరోలు ముంచెత్తుతున్న సమయంలో ఆసియాకు చెందిన జాకీచాన్‌ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. హాలీవుడ్‌ హీరోలకు ఏమాత్రం తీసి పోకుండా ఇమేజ్‌ ను క్రియేట్‌ చేసుకున్న జాకీచాన్‌ తాజాగా తన బయోగ్రఫీ బుక్‌ ను రిలీజ్‌ చేశాడు. తాజాగా ఇంగ్లీష్‌ లో జాకీచాన్‌ బయోగ్రఫీ బుక్‌ ‘నెవర్‌ గ్రో అప్‌’ అనే పేరుతో వచ్చింది. ఈ పుస్తకంలో జాకీ చాన్‌ తన జీవితంలో జరిగిన పలు కీలక సంఘటనలు మరియు విశేషాలను వివరించడం జరిగింది.

కెరీర్‌ ఆరంభ సమయంలో తాను మద్యంకు బాగా బానిసయ్యాను. మర్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్న తర్వాతే తనకు మద్యం అలవాటు అయ్యిందని, ఆ సమయంలో కెరీర్‌ పై కూడా ప్రభావం పడుతుందని భావించాను. ఆ సమయంలో తాను ఏం చేసేవాడినో నాకే తెలియదు. రాత్రి సమయంలో ఫుల్‌ గా తాగి ఏ చెట్టుకో లేదా గోడకో గుద్దేవాడిని. ఎన్ని సార్లు అలా జరిగిందో లెక్కే లేదు. రాత్రంతా కూడా మద్యం తాగిన సందర్బాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

ఒకసారి తాగిన మత్తులో తన కొడుకును విసిరి కొట్టాడు. అదృష్టం కొద్ది అతడు సోఫాలో పడ్డాడు. లేదంటే పెద్ద గాయం అయ్యేది. అవన్నీ తల్చుకుంటే నాకు భయంగా, బాధగా అనిపిస్తుంది. తాను తాగుడుకు బానిస అయిన రోజులు తన జీవితంలోనే చీకటి రోజులు అంటూ జాకీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జాకీ వారసుడిగా ఆయన తనయుడు సినీ రంగంలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం జాకీ పూర్తిగా మద్యంకు దూరం అయ్యాయని, ప్రస్తుతం ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాను అంటూ బయోగ్రఫీలో పేర్కొన్నాడు.