Begin typing your search above and press return to search.

బాబూ బంగారం.. పాలిటిక్స్ ఏలమ్మా!!

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:30 PM GMT
బాబూ బంగారం.. పాలిటిక్స్ ఏలమ్మా!!
X
గతంలో రామానాయుడు పాలిటిక్స్ లో కొన్ని రోజులు తిరిగిన మాట వాస్తవమే. ఎంపి కూడా అయ్యారు. అయితే ఆయన తరువాత దగ్గుబాటి ఫ్యామిలీలో ఎవ్వరూ పాలిటిక్స్ కు దగ్గరగా కూడా వెళ్లలేదు. ప్రస్తుతమైన ఎవ్వరికీ ఇంట్రెస్టు కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ''బాబు బంగారం'' వాడు ఇచ్చిన ఒక యాడ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు రేపుతోంది.

బాబు బంగారం సినిమా వారు వేసిన పేపర్ యాడ్స్ గురించి డిస్కష్లు ఏంటంటే.. మనోళ్ళు పుష్కరాలు బాగా జరిగినందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం.. అటు ఆంధ్ర ప్రభుత్వానికి విషెస్ చెబుతూ ఒక యాడ్ రిలీజ్ చేశారు. అసలు ఒక సినిమా యాడ్లో ఇలా పుష్కరాల గురించి యాడ్లు ఇవ్వడం చాలా కొత్తగానే ఉంది. అందుకే అందరూ వీరు యాడ్ ఎందుకిచ్చారబ్బా అంటూ స్టడీ చేస్తున్నారు. అసలు బంగారానికి ఈ పాలిటిక్స్ కి లింక్ ఏంటో అర్ధం కావట్లేదమ్మా.

ఇంకోప్రక్కన ఇప్పటికే 20 కోట్లు షుమారు షేర్ వసూలు చేసిన బాబు బంగారం సినిమా ఇంకో 10 కోట్లు వసూలు చేస్తే కాని పంపిణీదారులను గట్టెక్కదని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ పుష్కరాల యాడ్ కారణంగా ఏమన్నా జనాలు కరిగిపోయి ధియేటర్లకు వచ్చేస్తారా? చూద్దాం!!