Begin typing your search above and press return to search.

బాబూ.. బాల్ అక్కడ వేయమ్మా

By:  Tupaki Desk   |   23 March 2017 6:04 PM GMT
బాబూ.. బాల్ అక్కడ వేయమ్మా
X

బాలీవుడ్ లో వచ్చిన ''హంటర్'' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారంటే.. ఖచ్చితంగా ఎడల్ట్ కంటెంట్ ఏమన్నా టోన్ డౌన్ చేసి తీస్తారేమో అనుకుంటాం. కాని ''బాబు బాగా బిజీ'' అంటూ మనోళ్ళు విపరీతమైన శృంగార రసాన్ని అక్కడ ఒలికించేశారు. బాబుకు అదే పనిగా.. పనిలో పనిగా.. పనే జీవితంగా.. వామ్మో ఒక రేంజులో ఉందంతే.

సెక్స్ కోసం అనునిత్యం పరితపించిపోయే ఒక హీరోగా కమెడియన్ శ్రీనివాస్ అవసరాలు ఇప్పుడు ''బాబు బాగా బిజీ'' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మిష్టి చక్రవర్తి.. తేజస్వి మదివాడ.. సుప్రియా అయాసొల.. శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిష్టి తప్పించి అందరూ తెలుగమ్మాయిలే. ఇక మనోడు ఈ అమ్మాయిల గ్లామర్ ను ఒక రేంజులో వాడేసుకున్నాడంతే. సుప్రియ వంటి స్ర్టగ్లింగ్ హీరోయిన్ అయితే లోదుస్తుల్లో కూడా మెరిసిపోయింది. తేజస్వి ముద్దుల్లో ముంచెత్తింది. శ్రీముఖి గ్లామర్ఒ ఒలకబోసింది. ఒక రకంగా చూస్తుంటే ఈ బాబు సినిమా షకీలా సినిమాకన్నా ఘాటుగా మోటుగా ఉంది. ఈ సినిమాకు అసలు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందంటారా?

ఎడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీయడం తప్పు కాదులే కాని.. మన తెలుగు సినిమాలకు ఇంకా ఆ పరిధిని దాటేసి హద్దులు చెరిపేసి శృంగార వడ్డన వడ్డించేంత సీన్ రాలేదు. అలాంటప్పుడు కాస్త పనిని అదుపులో పెట్టుకుంటే బాగుండేదేమో. బాబూ.. ఇక బాల్ సెన్సార్ కోర్టులో వేయమ్మా!!