Begin typing your search above and press return to search.

చిన్న చిన్న సినిమాలు ఊరిస్తున్నాయ్

By:  Tupaki Desk   |   27 March 2017 6:45 AM GMT
చిన్న చిన్న సినిమాలు ఊరిస్తున్నాయ్
X
పెద్ద సినిమాల హడావుడి మధ్యలో చిన్న సినిమాలు కుదేలు అయిపోతాయ్ అనుకుంటే.. కాటమరాయుడు వంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోబ్బోవడంతో.. ఇప్పుడు చిన్న సినిమాలకు కొత్త ఊపొచ్చేసింది. ఇంకో నెల రోజుల తరువాతే బాహుబలి 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ లోపు ప్రజలను ఆకట్టుకోవడానికి కొన్ని చిన్న సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. అయితే అన్నీ వెంటనే రిలీజ్ అవ్వట్లేదు కాని.. కొన్ని చిన్న సినిమాలు మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయనే చెప్పాలి.

బాబు బాగా బిజీ .. కేశవ.. మిష్టర్.. వంటి చిన్న సినిమాల గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాల ట్రైలర్లకు విశేష స్పందన వచ్చేసింది. బాబు బాగా బిజీ ట్రైలర్లో ఎడల్ట్ కంటెంట్ అదిరిపోయింది. ఛీ ఏంటిది అంటూనే ఏకంగా 3 మిలియన్ వ్యూయర్లు ఆ ట్రైలర్ ను చూసేశారు. ఇక కేశవ సినిమాలోని రెవెంజ్ యాంగిల్ కూడా బాగా క్లిక్కయ్యిందనే చెప్పాలి. అందుకే ఆ సినిమా ట్రైలర్ కు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక సింపుల్ అండ్ రొటీన్ గా ఉన్న మిష్టర్ కూడా.. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చినట్లే ఉంది. అందుకే ఆ సినిమా ట్రైలర్ కు కూడా 1 మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి. ఇదంతా చూస్తుంటే.. ఈ చిన్న సినిమాలు ధియేటర్లలో కూడా బాగానే హల్చల్ చేస్తాయని ఆశాజనకంగా ఉంది కదూ.

ఈ విధంగా ఊరిస్తున్న చిన్న సినిమాలన్నీ మే నెల పూర్తయ్యేసరికి ధియేటర్లలోకి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. ఆల్రెడీ మిష్టర్ ఏప్రియల్ 14న ఫిక్స్ చేసుకుంటే.. కేశవ అండ్ బాబు బాగా బిజీ ఇంకా డేట్లు డిసైడ్ చేసుకోలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/