Begin typing your search above and press return to search.

వీడియో టాక్: మియామి బీచ్లో సెగలు

By:  Tupaki Desk   |   28 July 2017 6:43 AM GMT
వీడియో టాక్: మియామి బీచ్లో సెగలు
X
బాలీవుడ్ సినిమాలు అంటేనే.. కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా హీరోయిన్ల అందాలతో నింపేయడమే ఆనవాయితీ. మామూలుగా పైకి మాత్రం మనోళ్ళు ఫెమినిజం తొక్కా తోటకూర అంటూ కబుర్లు చెబుతారు కాని.. కాక్ టైల్ సినిమాలో దీపికా పదుకొనె అయినా.. షాందార్ లో ఆలియా భట్ అయినా.. బార్ బార్ దేఖో సినిమాలో కత్రినా కైఫ్‌ అయినా కూడా.. టూ పీసుల్లో కనిపించి మరీ రెచ్చగొట్టేశారు. అందాలను ఆరబోయడమే ఇక్కడి ఓన్లీ టార్గెట్.

ఇక ఇండియాలో పుట్టిపెరిగిన ఈ మిడిల్ క్లాస్ పిల్లలే ఇలా రెచ్చిపోతుంటే.. (కత్రినా ఇండియన్ కాకపోయినా కూడా ఇండియా సంతతికి చెందిన బ్రిటీష్‌ మధ్యతరగతి పిల్లేలే).. మరి ఆస్ర్టేలియాలో పుట్టి పెరిగిన శ్రీలంక సంతతి హాటీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటికే చాలా సినిమాల్లో తన అందచందాలను అసలు అవసరానికి మించి ఆరబోసింది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఇప్పుడు త్వరలో రాబోతున్న 'ఏ జెంటిల్మన్' సినిమాలో అయితే ఏకంగా అమెరికాలో ఉండే అమ్మాయి పాత్రను చేస్తోంది కాబట్టి.. ఈ అందాలదాటిని ఇంకా ఉదృతం చేసింది. నిన్ని రిలీజైన 'బాత్ బన్ జాయే' పాట వీడియోను చూస్తే.. ఆ సెగలేంటో మీకే తెలుస్తుంది.

ఈ పాటలో బికినీ టాపులూ.. లేదంటే లోపల బికినీ వేసుకుని పైన మరో తేలికపాటి టాప్.. అలాగే కాళ్ళను అస్సలు కవర్ చేయలేని షార్ట్స్ వగైరా వేసుకుని.. చాలా ట్రెండీగా కనిపిస్తూ.. పాట పాడేది హీరో అయినా కూడా అతన్ని డామినేట్ చేసే అందంతో మియామీ బీచులో రెచ్చిపోయింది జాకి. ఒక్కాసారి పాటను చూసినెవ్వరికైనా కూడా భారీ లెవెల్లో కిక్కెక్కడం ఖాయం. డౌటుంటే ఓసారి మీరూ చూస్కోండి!!