Begin typing your search above and press return to search.

50 డేస్‌ః చరిత్ర సృష్టించిన బాహుబలి

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:49 AM GMT
50 డేస్‌ః చరిత్ర సృష్టించిన బాహుబలి
X
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసి, ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూసేందుకు కారణం... రాజమౌళి తీసిన బాహుబలి. ఇప్పుడీ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. జూలై 10న రిలీజైన బాహుబలి... ఇవాల్టితో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటోంది. గత కొన్నేళ్లలో ఏ చిత్రానికి సాధ్యం కానన్ని థియేటర్లలో ఈ మూవీ 50 రోజులు ఆడ్డం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన కాన్సెప్ట్ గా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కలెక్షన్స్ విషయంలో... మరే తెలుగు మూవీకి అందనం స్థాయికి వెళ్లిపోయింది. ఈ రికార్డు టచ్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదేమో. అంతే కాదు 500 కోట్ల క్లబ్ లో చేరి... 600కోట్ల మార్క్ ను అందుకుంటున్న ఏకైక తెలుగు సినిమా ఇది. ఇలాంటి సమయంలో కలెక్షన్స్ తగ్గిన చోట సినిమాను తీసేయండి, రికార్డుల కోసం బలవంతంగా అడించొద్దంటూ.. రాజమౌళి తన సహృదయాన్ని చాటుకున్నాడు. ఊహించని స్థాయి రికార్డ్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబ్తూనే... కొత్త సినిమాలకు దారి ఇవ్వాలని, రికార్డుల కోసం థియేటర్లపై ఒత్తిడి తేవద్దని ఫ్యాన్స్ కు సూచించాడు. ఎలాగూ ఈ రికార్డులన్నిటినీ తుడిచేసే సత్తా బాహుబలి2కి ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే... ఫ్యాన్స్ ను సున్నితంగానే చెప్పినా... సరైన మాటే చెప్పాడు జక్కన్న.

వచ్చే నెలాఖర్లో బాహుబలి2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి పార్ట్ ఇచ్చిన సక్సెస్ కారణంగా.. సీక్వెల్ కు మరిన్ని హంగులు అద్దేందుకు స్క్రిప్ట్ ను మరింత పక్కాగా రూపొందిస్తున్నారని, విజువల్ ఎఫెక్ట్స్ మరింతగా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం