Begin typing your search above and press return to search.

ఆస్కార్ రేసులో బాహుబలి.. కష్టమే

By:  Tupaki Desk   |   27 Aug 2015 7:36 PM GMT
ఆస్కార్ రేసులో బాహుబలి.. కష్టమే
X
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి ఆస్కార్ అవార్డ్ రేసులో ఉందా? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఈ ఏడాదికిగాను ఆస్కార్ అవార్డుల పోటీకి పంపేందుకు సెలక్షన్ ప్యానల్ చూసిందని అంటున్నారు. హైద్రాబాద్ లో జరిగిన ఈ స్క్రూటినీ లో.. మొత్తం 45 సినిమాలను పరిశీలించారని, వీరంతా బాహుబలిని పంపాలని నిర్ణయించారనే టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించడమే లేట్ అని కూడా గుసగుసలాడేసుకుంటున్నారు.

అమీర్ ఖాన్ పీకే, అనురాగ్ కశ్యప్ ఉగ్లీ, విశాల్ భరద్వాజ్ హైడర్, ప్రియాంక చోప్రా నటించిన మేరీకోమ్ కూడా ఈ రేసులో పోటీ పడ్డా.. చివరికి బాహుబలికే అంతా మొగ్గు చూపారని.. ఇక సెప్టెంబర్ 25న అధికారికంగా ప్రకటించే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. కే విశ్వనాథ్- కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం తర్వాత ఆ రికార్డ్ సాధించిన చిత్రం బాహుబలి అని కొందరు అంతర్గతంగా ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడ టెక్నికల్‌గా బాహుబలి సినిమాను ఆస్కార్‌ కు నామినేట్‌ చేయలేని పరస్థతి ఉంది. బాహుబలి ది బిగినింగ్ ని ఆస్కార్‌ కమిటీ పరిశీలించి ఉండొచ్చు. కానీ.. ఈ చిత్రాన్ని అస్కార్ కమిటీకి పంపే సాహసాన్ని సెలక్షన్ ప్యానల్ చేయలేదు. ఎందుకంటే అలా పంపించినా... ఎంట్రీ వృథా అయిపోతుంది. అస్కార్ అవార్డ్ దక్కించుకోవాలంటే.. మూవీ చివరికి ఏ సస్పెన్స్ మిగలకూడదు. థ్రిల్లర్ అయినా సరే అన్నింటినీ రివీల్ చేయాల్సిందే. ఒకవేళ సీక్వెల్ లాంటివి ఉంటే.. ఆ సిరీస్ లో చివరి చిత్రాన్ని మాత్రమే ఆస్కార్ పరిగణిస్తుంది. హాలీవుడ్ మూవీస్ కి అయినా... ఇదే ఫార్ములా వర్తిస్తుంది.

మరి మన బాహుబలిలో క్వశ్చన్స్ తప్ప ఆన్సర్స్ ఉండవు. దీనికి ఆస్కార్ అవార్డుల కమిటీ పరిశీలనకు కూడా తీసుకోంది. ఈ విషయం అమోల్ పాలేకర్ నేతృత్వంలోని ప్యానల్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కాకపోతే.. బాహుబలి ది కంక్లూజన్ కి మాత్రం ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ అవార్డ్ పట్టుకొచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో... ఈ ఏడాది మాత్రం బాహుబలి ది బిగినింగ్ కి ఆస్కార్ ఎంట్రీ కూడా లభించదనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే.