Begin typing your search above and press return to search.

బోర్డర్ లెస్ ట్యాలెంట్ - హద్దుల్లేని విజయం

By:  Tupaki Desk   |   31 July 2015 8:15 PM GMT
బోర్డర్ లెస్ ట్యాలెంట్ - హద్దుల్లేని  విజయం
X
తెలుగు సినిమా సత్తా ఏంటో యుద్ధం చేసి మరీ ప్రపంచానికి చెప్పింది బాహుబలి. మరి ఈ సినిమా క్రెడిట్ ఏ ప్రాంతానికి చెందుతుంది ? ఇదో టఫ్ క్వశ్చన్. ఎందుకంటే... ఈ మూవీ కోసం పని చేసిన టీం అలాంటిది మరి. బాహుబలి పేరుతో నిజామాబాద్ ప్రాంతంలో ఓ రాజు ఉండేవాడు. కాబట్టి బాహుబలి తెలంగాణకు చెందిన సినిమానే అంటూ ఓ వాదన మొదలైంది. నిజానికి ఈ కామెంట్స్‌ ని తీవ్రంగా ఖండించాల్సిందే.

బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు శోభు-ప్రసాద్‌ లు ఆంధ్రప్రదేశ్ వారే. అలాగే హీరో ప్రభాస్ భీమవరం వ్యక్తి అని అసలు చెప్పనక్కర్లేదు. అలాగని ఈ సినిమా క్రెడిట్‌ ని ఆంధ్రాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. లీడ్ కేరక్టర్స్ రమ్యకృష్ణ, సత్యరాజ్‌ లు తమిళనాడుకు చెందినవారు. అనుష్క కన్నడ అమ్మాయి కాగా.. అలా ఓ సారి మెరిసిన సుదీప్ కూడా ఆ ప్రాంతం వాడే. ముంబైలో పుట్టిన పోరి తమన్నా. ప్రొడక్షన్ డిజైనర్ సిబు సిరిల్ మళయాళీ వ్యక్తి. వియత్నాం నుంచి వలస వచ్చి చెన్నై లో స్థిరపడ్డాడు యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్. రాణా, భారీ అడవి దున్న ఫైట్ సీక్వెన్స్ యానిమేట్ చేసింది మలేషియాకు చెందిన స్టూడియో. మ్యూజిక్ ఇచ్చినది కీరవాణే అయినా.. ఫొలియో సౌండ్ రికార్డింగ్ చేసినది నెదర్లాండ్స్ ఇంజినీర్. తెలంగాణలో పబ్లిసిటీ తో జనాలకు పిచ్చెక్కించిన వ్యక్తి దిల్ రాజు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లోనూ ఇంతగా సక్సెస్ కావడానికి కారణం కరణ్ జోహార్.

సరిహద్దులు దాటిన ప్రతిభ, అందరూ కలిసి మూడేళ్ల కు పైగా పడిన కష్టానికి ప్రతిఫలం బాహుబలి విజయం. రూ.500 కోట్ల క్లబ్లో కి దూసుకుపోతున్న గ్రాస్ కలక్షన్స్ సాధించిన తొలి దక్షిణ భారత చిత్రంగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ క్రెడిట్ మొత్తం యూనిట్ కి ఇవ్వాలి కానీ... ఇలా ఒక ప్రాంతానికి అంటగట్టడం ఏమాత్రం సరికాదు.