Begin typing your search above and press return to search.

నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్.. వెన్నుపోటు!

By:  Tupaki Desk   |   20 Jan 2019 8:59 AM GMT
నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్.. వెన్నుపోటు!
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాపై ఫోకస్ చేస్తే చాలు.. ఇక ఆడియన్స్ అందరూ ఆ సినిమాపై ఫోకస్ చేసేంతవరకూ అయన నిద్రపోడు. ఆర్జీవీ ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈ సినిమాపై హైప్ పెంచేందుకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రయోగిస్తున్నాడు.

తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. . వారెవరో గుర్తుచేసుకోవడంలో నాకు సహాయం చేయగలరా?" అంటూ ప్రశ్నించాడు. ఫోటోలో క్యాప్షన్ "నెవర్ బెఫోర్.. నెవర్ ఆఫ్టర్".. కింద సినిమా టైటిల్ లా 'వెన్నుపోటు' అంటూ క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. ఇంతకీ ఫోటోలో ఏముందంటే కట్టప్ప బాహుబలిని కసక్కుమని 'వెన్నుపోటు' పొడిచే పోజు. ప్రభాస్ మొహాన్ని సీనియర్ ఎన్టీఆర్ ఫేసుతోనూ కట్టప్ప గారి ముఖారవిందాన్ని బాబుగారి మొహంతోనూ ఉన్నట్టుగా ఫోటో షాప్ సహాయంతో మార్చారు. ఈ కట్టప్ప మొహం మరింత స్పెషల్.. గ్రీన్ షేడ్ లో ఉంది. ఊసరవెల్లిలా రంగులు మార్చి మరీ వెన్నుపోటు పొడిచాడని అర్థమేమో!

వర్మే అనుకుంటే వర్మ ఫాలోయర్స్ కూడా ఆయనకంటే ఘనులు. ఒక ఫాలోయర్ 'నాకంటే గొప్ప నటుడు నారా: ఎన్టీఆర్' అనే పాత పేపర్ క్లిప్పింగ్ ను జత చేశాడు. మరొకరు 'ఎన్టీఆర్ పై బాబు వర్గం చెప్పుల దాడి' అని క్లిప్పింగ్ ను కూడా పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తూ ఉంటే రామ్ గోపాల్ వర్మ పోస్టులకు భారీగా నే రెస్పాన్స్ వస్తున్నట్టు ఉంది. మరి వర్మ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సూపర్ హిట్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.