Begin typing your search above and press return to search.

ఈ రోజు నాలుగింటికి ఏమవ్వబోతోంది?

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:24 AM GMT
ఈ రోజు నాలుగింటికి ఏమవ్వబోతోంది?
X
అక్టోబర్ 22.. ఈ రోజు కోసం సినిమా లవర్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజున సాక్షాత్కారం కాబోయే ఓ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఎదురుచూపులకు తగ్గట్లుగా రాజమౌళి సృష్టిలోంచి వచ్చే అపురూపమైన చిత్ర రాజానికి సంబంధించిన.. బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల ఇవాళే.

టాలీవుడ్ చరిత్రను మార్చేసి.. మన సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ సంచలనాల గురించి చాలానే చెప్పేసుకున్నాం. అందుకే బాహుబలి ది కంక్లూజన్ గురించే చెప్పుకుందాం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా.. ఓ రోజు ముందే అంటే ఇవాళే బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కం టీజర్ విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ఓ మహాద్భుతం తమ కళ్లముందుకు వచ్చేస్తుందని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న మామి 18వ ముంబై ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి-ప్రభాస్-రానా సహా ప్రధాన యూనిట్ అంతా ముంబై చేరుకున్నారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెబితే.. బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన అసలు కథకు బిగినింగ్ ఇవాళే.

సెలబ్రిటీల ట్వీట్లు.. ట్విట్టర్ హ్యాష్‌ ట్యాగ్ రికార్డులు.. ఫేస్ బుక్ షేర్ రికార్డులు.. తుపాకీలో ఆల్ అప్డేట్లు.. గెట్ రెడీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/