బాహుబలి-2 ఆడియోలో ఏముందంటే..

Mon Mar 20 2017 22:06:10 GMT+0530 (IST)

భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలిః ది కంక్లూజన్’ విడుదలకు ఇంకో 40 రోజులు కూడా సమయం లేదు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూసి జనాల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ హైప్ ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్ జోరు పెంచుతోంది బాహుబలి టీం. ట్రైలర్ లాంచ్ తర్వాత.. ఆడియో వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో ‘ది కంక్లూజన్’ ఆడియో వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఆరు రోజుల ముందే ట్రాక్ లిస్ట్ బయటికి వచ్చేసింది. ‘బాహుబలి ది కంక్లూజన్’లో ఐదు పాటలున్నాయి.

బాహుబలి-2 ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పుడే దలేర్ మెహందీ వాయిస్ తో సాహోరే బాహుబలి అంటూ సాగే హమ్మింగ్ విన్నారు జనాలు. ఈ పాటే బాహుబలి-2 ఆడియోలో మొదటిది. దీన్ని కీరవాణి తండ్రి శివశక్తి దత్తా.. డాక్టర్ రామకృష్ణ కలిసి రాశారు. దలేర్ మెహందితో పాటు కీరవాణి.. మౌనిమ కూడా వాయిస్ ఇచ్చారు. ఇక చైతన్య ప్రసాద్ రాసిన హంస నావ అనే పాటను సోనీ.. దీపు ఆలపించారు. ఇది డ్యూయెట్ లాగా అనిపిస్తోంది. ఆడియోలో ఉన్న మిగతా మూడు పాటలనూ కీరవాణే రచించడం విశేషం. కన్నా నిదురించరా అనే పాటను శ్రీనిధి-శ్రీ సౌమ్య.. దండాలయ్యా.. ఒక ప్రాణం అనే పాటల్ని కాలభైరవ అనే గాయకుడు పాడారు. మరి ఈ పాటలెలా ఉంటాయో ఈ ఆదివారం తెలుసుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/