Begin typing your search above and press return to search.

ప్రభాస్ బర్త్ డే.. హంగామా షురూ

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:36 AM GMT
ప్రభాస్ బర్త్ డే.. హంగామా షురూ
X
టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇప్పుడు దేశం మొత్తం బాహుబలి ది కంక్లూజన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని అనేందుకు సందేహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 2017లో రిలీజ్ కానున్న సినిమాల్లో.. హైయెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీ ఇదే. ఇతర స్టార్ హీరోల సినిమాల కంటే.. బాహుబలి2 విషయంలోనే బజ్ ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఇప్పటి నుంచే ప్రచార హంగామా ప్రారంభించేయనున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.

బాహుబలి2 హంగమా షురూ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. బాహుబలి పాత్ర ధారుడు.. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టారుడు.. భారీ శివ లింగాన్ని భుజాలపై సునాయాసంగా మోసిన అనితర సాధ్యుడు అయిన ప్రభాస్ పుట్టిన రోజున.. అంటే అక్టోబర్ 23నుంచి బాహుబలి ప్రమోషన్స్ మొదలైపోనున్నాయి. అదే రోజున బాహుబలి ది కంక్లూజన్ కు.. టీజర్ విడుదల చేయనున్నారు.

బాహుబలి మొదటిభాగానికి హైలైట్ గా నిలిచిన యుద్ధ సన్నివేశాలను.. ఈ సారి మరింత భారీగా తీస్తున్నారనే టాక్ ఉంది. అది ఏ స్థాయి అనే విషయంలో.. జక్కన్న టీజర్ లో క్లారిటీ ఇచ్చేస్తున్నాడని అంటున్నారు. మొదటి భాగానికి మించిన థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలానే బాహుబలి2 ఉంటాయనే విషయాన్ని.. ప్రభాస్ పుట్టిన రోజున విడుదలయ్యే బాహుబలి ది కంక్లూజన్ టీజర్ లో చెప్పేయనున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/