Begin typing your search above and press return to search.

ట్రైలర్ జనవరిలో.. సినిమా ఏప్రియల్ 28న

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:11 PM GMT
ట్రైలర్ జనవరిలో.. సినిమా ఏప్రియల్ 28న
X
బాహుబలి 2.. సడన్ గా ప్రెస్ మీట్ పెట్టారు.. ఎందుకూ అంటే.. అసలు సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. ఎంత పార్టు పూర్తయ్యింది.. అలాగే సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనేది చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టారట.

నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పిన వివరాల ప్రకారం.. అక్టోబర్ అండ్ నవంబర్ షూటింగ్ ఉందట. డిసెంబర్ లో మిగతాది పూర్తి చేస్తారట. కొన్ని సీన్లు అలాగే రెండు పాటలు ఉన్నాయి. ఏప్రియల్ 28.. 2017న బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుంది. ఇకపోతే ట్రైలర్ అండ్ టీజర్ మాత్రం జనవరి 2017లోనే వచ్చే ఛాన్సుందట.

ఇకపోతే ''అక్టోబర్'' నెలంతా బాహుబలి అభిమానులకు పండగనే. రేపు (అక్టోబర్ 1న) ఈ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రిలీజవుతుంది. అంతే కాకుండా అక్టోబర్ 22న బాహుబలి కామిక్ సిరీస్ పుస్తకాలు రిలీజవుతున్నాయి. అలాగే అక్టోబర్5న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆనందపడే విషయం ఏదో రిలీజ్ చేస్తారట. ఇకపోతే బాహుబలి 2 తాలూకు ఫస్ట్ లుక్ కూడా అక్టోబర్ 22నే.. ప్రభాస్ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు రిలీజ్ చేస్తారట. బాహుబలి వర్చువల్ రియాల్టీ ఎక్స్ పీరియన్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తున్నారట. అక్టోబర్ 23న ఈ వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో వస్తోందట.

ఇక బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో చెప్పని రాజమౌళి.. సినిమాకు సంబంధించి కూడా ఎటువంటి డిటైల్స్ సినిమా రిలీజయ్యే వరకు చెప్పను అని చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/