Begin typing your search above and press return to search.

బాహుబలి 2 ప్రెస్ మీట్.. అందుకోసమేనా?

By:  Tupaki Desk   |   29 Sep 2016 1:30 PM GMT
బాహుబలి 2 ప్రెస్ మీట్.. అందుకోసమేనా?
X
ఉన్నట్లుండి ప్రెస్ మీట్లు పెట్టడం.. హడావుడి చేయడం.. వంటి వాటి గురించి రాజమౌళి చాలా కేర్‌ఫుల్ గా ఉంటాడు. మనోడు తన సినిమా పూర్తయ్యాకనే రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ డేట్ ఎలాగో ఏప్రియల్ లో కాబట్టి.. అప్పుడే రాజమౌళి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టే ఛాన్సేలేదు. కాకపోతే రేపు సాయంత్రం మనోడు మీటింగ్ అంటూ కబురంపాడండోయ్.

శుక్రవారం సాయంత్రం 6.30 కు రాజమౌళి - ప్రభాస్ అండ్ ప్రొడ్యూసర్లు మీడియాతో మాట్లాడతాం అంటూ ప్రెస్ నోట్లు పంపారు. ఇంతకీ ఈ ప్రెస్ మీట్ ఎందుకు అనే సందేహమే ఇప్పుడు చాలామందికి వస్తుంది. ఓకె షూటింగ్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఇలాంటి క్లారిటీ ఇవ్వడానికేనా? అయితే అవ్వొచ్చు. కాకపోతే మీడియా వారికి వచ్చిన సందేహం ఏంటంటే.. ఆల్రెడీ బాహుబలి 2 రిలీజ్ డేట్ ఏప్రియల్ 28 అని రూమర్లు బయటకొచ్చాక.. అదే తేదీన మహేష్‌ అండ్ మురుగుదాస్ ఫిలిం కూడా రిలీజ్ అన్నారు. ఒకవేళ ముందుగానే తమ రిలీజ్ స్లాటును కన్ఫామ్ చేస్తే మహేష్‌ కొత్త డేట్ వెతుక్కుంటాడని బాహుబలి 2 టీమ్ భావిస్తోందా? అందుకే ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారా?

ఏదేమైనా కూడా చాలారోజుల తరువాత రాజమౌళి మళ్లీ మీడియాను కలుస్తున్నాడు కాబట్టి.. అందరికీ ఎక్సయిటింగ్ గానే ఉంది. రొటీన్ గా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని అడగకండి గురూ.