Begin typing your search above and press return to search.

పైరసీలో కూడా బాహుబలిదే పైచేయి

By:  Tupaki Desk   |   21 March 2018 12:22 PM GMT
పైరసీలో కూడా బాహుబలిదే పైచేయి
X
పైరసీ.. ఫిల్మ్ ఇండస్ట్రీ ని కొన్ని సంవత్సరాలుగా పత్తి పీడిస్తున్న పెను భూతం. ఎన్నో ప్రయత్నాలు తరువాత కూడా పైరసీని ఇంకా పూర్తిగా నిర్మూలించడం కుదరలేదనే చెప్పచ్చు. దానికి సాక్ష్యమే ఒక జర్మన్ టెక్ కంపెనీ టెక్జిపియో విడుదల చేసిన డేటా. అత్యధికంగా షేర్ అయినటువంటి తెలుగు సినిమాల జాబితా అది.

టాలీవుడ్లో ఒక కొత్త శకం మొదలు పెట్టి, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి సినిమా పైరసీ లో కూడా మొదటి స్థానంలో ఉండటం విశేషం. దాదాపు 10 మిలియన్ సార్లు ఈ సినిమా తాలూకు పైరసీ వర్షన్ డౌన్ లోడ్ అయ్యిందట. ఇక రెండవ స్థానంలో ఉన్న డిజె సినిమా కనీసం 2 మిలియన్ షేర్స్ కూడా రాకుండా బాహుబలి మాత్రం దాదాపు 10 మిలియన్ కు దగ్గరగా ఉండటానికి కారణం పలు భాషల్లో విడుదల చేయడం అనే చెప్పచ్చు. 2012 నుండి టెక్జిపియో కంపెనీ గమనించిన పీర్ టు పీర్ ఫైల్స్ షేరింగ్ మరియు డౌన్ లోడింగ్ ద్వారా బయటకువచ్చిన రిజల్ట్స్ ఇవి. సినిమా డేటా షేర్ అయిన దేశాల్లో మొదట ఇండియా ఉండగా - తరువాత యూఎస్ - శ్రీలంక - సౌదీ అరేబియా - యూఏఈ ఉన్నాయి. భారత దేశంలో అత్యధిక పైరసీ సినిమాల షేరింగ్ జరిగిన ప్రాంతాలు హైదరాబాద్ - బెంగళూరు - చెన్నై - విశాఖపట్నం - విజయవాడ - ముంబై మరియు కొన్ని నార్త్ లో కొన్ని సిటీలు అని తెలుస్తోంది.

ఇందులో మరి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏంటి అంటే, బాహుబలి 2 షేర్ చేసిన వారిలో 60 శాతం మొదటి పార్టును కూడా జతచేశారు. డిజె సినిమా లింక్స్ విడుదల అయిన మొదటి రోజు నుండి పని చేస్తున్నాయి. ఫిదా సినిమాను ఎక్కువగా యూఏఈ - శ్రీలంక జనాలు పైరసీలో చూశారు. నేను లోకల్ సినిమాకు 83 శాతం షేర్లు భారత దేశంలోనే లభించాయి. నిన్నుకొరి సినిమా ఇండియా లో ఎక్కువగా షేర్ అయిన ప్రాంతాలు హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు. లై సినిమాకి 38000 షేర్లు రష్యాలో నమోదు అయ్యాయి.

టాప్ 10 పొజిషన్స్ లో ఉన్న మన తెలుగు సినిమాల లిస్ట్ ఇదే.

బాహుబలి - 9.37 మిలియన్ షేర్లు
దువ్వాడ జగన్నాధం - 1.7 మిలియన్
అర్జున్ రెడ్డి - 1.4 మిలియన్
ఫిదా - 1.15 మిలియన్
ఖైదీ నెంబర్ 150 - 1 మిలియన్
నిన్ను కోరి - 899978
నేను లోకల్ - 869978
లై - 841974
నేనే రాజు నేనే మంత్రి - 831974
రాజా ది గ్రేట్ - 774121