ఫేస్ బుక్ లో బాహుబలి రికార్డ్

Wed May 24 2017 15:03:09 GMT+0530 (IST)

బాహుబలి సెన్సేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎన్నో అంశాల్లో ఫస్ట్ రికార్డ్ లు బాహుబలి సొంతం అయ్యాయి. వెయ్యి కోట్ల క్లబ్.. రెండు వేల కోట్ల క్లబ్.. ఇండియాలోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లోనే 180 కోట్ల షేర్.. మొదటిసారి 400 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన హిందీ మూవీ.. ఇలా లెక్కలేనన్ని రికార్డులు బాహుబలి ఖాతాలోకి చేరిపోయాయి.

ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కొత్త రికార్డ్ సృష్టించింది బాహుబలి మూవీ. కేరక్టర్ ఆధారిత స్టిక్కర్స్ ను ఫేస్ బుక్ పరిచయం చేసింది. బాహుబలి మూవీలోని ప్రధాన పాత్రలు.. వారి సిగ్నేచర్ పోస్టర్స్ ఆధారంగా స్టిక్కర్స్ రూపొందించారు. బాహుబలి.. కట్టప్ప.. శివగామి.. భల్లాల.. దేవసేన.. ఇలా దాదాపు అన్ని ప్రధాన కేరక్టర్స్ సంబంధిత స్టిక్కర్స్ పరిచయం చేశారు. ఒక సినిమా ఆధారంగా ఇలా ఫేస్ బుక్ లో స్టిక్కర్స్ రూపొందించడం అనే విషయంలో.. బాహుబలికే మొదటి రికార్డ్ దక్కింది.

 ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రానికి ఈ గౌరవం దక్కలేదు. ఇప్పుడు తొలిసారిగా బాహుబలి చిత్రానికే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇంకా బాహుబలి ఎన్నేసి రికార్డులు సృష్టించనుందో చూడాలి.