Begin typing your search above and press return to search.

బాహుబలి@సివిల్ ఇంజనీరింగ్ పేపర్

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:21 AM GMT
బాహుబలి@సివిల్ ఇంజనీరింగ్ పేపర్
X
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ప్రతిష్ట కలిగించిన బాహబలి పరీక్షల్లో ప్రశ్నగా నిలిచిన వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదీ కూడా సివిల్ ఇంజనీరింగ్ పరీక్షల్లో ప్రశ్న కావటం మరీ విశేషం. విషయానికి వస్తే తమిళనాడులోని వెల్లూరు వీఐటీ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఈ అరుదైన ఘటనకు నాంది పలికింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన ఈ అత్యద్భుతమైన ఫాంటసీ మూవీ ఆధారంగా విద్యార్థుల మెదడుకు మేత పెట్టారు.

బాహుబలి సినిమాలో క్లైమాక్స్‌ లో వచ్చే యుద్ధ సన్నివేశంలోని సెట్ పీస్ డిజైనింగ్‌పై ప్రశ్నను తమ ప్రశ్నాపత్రంలో చూడటంతో విద్యార్థులు ఆశ్చర్యపడ్డారు. ఆగస్టు నెలలోనే ఈ ఘటన జరిగింది. ఈ పేపర్ రూపొందించిన వీఐటీ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లెర్నింగ్ ప్రక్రియను విద్యార్థులు ఆస్వాదించడంలో తోడ్పడుతుందనే

ఆలోచనతో ఈ ప్రశ్నను రూపొందించినట్లు తెలిపారు. ఆయన అడిగిన ప్రశ్నకు 20 మార్కులు. ఈ ప్రశ్నలో నటుల భద్రతకు హామీ ఇస్తూ, ఆప్టిమమ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ (అత్యంత గరిష్ట నిర్మాణ సుస్ధిరత)ని డిజైన్ చేయాలని విద్యార్థులను కోరారు.

తన ప్రశ్నలు చాలావరకు విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేవిధంగా అప్లికేషన్ ఆధారితంగా ఉంటాయని ఆ ప్రొఫెసర్ వివరించారు. మొత్తం మీద మన బాహుబలి ఇంజనీరింగ్ పరీక్షల్లో కూడా తన హవా సృష్టించిందన్నమాట.