Begin typing your search above and press return to search.

జూన్ 8.. బాహుబలి విడుదల

By:  Tupaki Desk   |   1 May 2016 11:30 AM GMT
జూన్ 8.. బాహుబలి విడుదల
X
బాహుబలి విడుదలై ఇప్పటికే దాదాపు పది నెలలు అవుతుంటే.. మళ్లీ కొత్తగా ఈ రిలీజ్ డేట్ ఏంటి అంటారా..? మామూలు సినిమాలకు ఒక రిలీజ్ డేటే కానీ.. బాహుబలి లాంటి విజువల్ వండర్స్ కు చాలా రిలీజ్ డేట్లే ఉంటాయి. ఈ సినిమా రిలీజైన నాటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. విదేశీ ప్రేక్షకుల్ని సైతం విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాను.. ఓపిగ్గా ఒక్కో దేశంలో విడుదల చేస్తూ వెళ్తున్నారు బాహుబలి నిర్మాతలు. ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేయడం కాకుండా.. స్థానిక భాషల్లో డబ్బింగ్ చేయడం లేదా.. సబ్ టైటిల్స్ ద్వారా రిలీజ్ చేయడం చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా సినిమాను ఎడిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను ఫ్రెంచ్ భాషలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 8న ఫ్రాన్స్ లో రిలీజవుతోంది ఈ సినిమా. అక్కడ కూడా సినిమా మీద మాంచి హైప్ ఉండటంతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. చైనాలో సైతం ‘బాహుబలి’ భారీ స్థాయిలో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా ‘బాహుబలి-2’ వచ్చే వరకు ఏదో ఒక దేశంలో విడుదలవుతూనే ఉంటుందేమో ఈ సినిమా. గత ఏడాది జులై 10న విడుదలైనపుడే రూ.600 కోట్ల దాకా వసూలు చేసింది ‘బాహుబలి: ది బిగినింగ్’. ఫస్ట్ పార్ట్ థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ‘పీకే’ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టేసినా ఆశ్చర్యం లేదు. ఆ సినిమా రూ.750 కోట్ల దాకా వసూలు చేసిన సంగతి తెలిసిందే.