Begin typing your search above and press return to search.

బాహుబలి.. ఈ కొత్త వీడియో చూశారా?

By:  Tupaki Desk   |   2 Aug 2015 11:47 AM GMT


ఆకాశాన్నంటే అంచనాల్ని అందుకోవడమే కాదు.. ఆ అంచనాల్ని దాటిపోయి అద్భుత విజయాన్నందుకుంది ‘బాహుబలి’. రెండొందల కోట్ల కలెక్షన్లు రాబడితేనే గొప్ప అనుకుంటే.. ఇప్పుడా సినిమా ఐదొందల కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఇప్పటికే బాహుబలిని విమర్శిస్తున్న జనాలకు రిటార్ట్ ఇస్తూ అనేక వీడియోలు, పోస్టులు తయారు చేసిన ఫ్యాన్స్.. బాహుబలి కలెక్షన్ల ప్రభంజనం మీదా ఓ వీడియో రెడీ చేశారు.

బాహుబలి సినిమాలో మనోహరి పాటకు ముందు ప్రభాస్, రానా ఓ కల్లు కాంపౌండుకు వెళ్లే సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో రాజమౌళి కూడా కనిపిస్తాడు. ప్రభాస్ వెళ్లి రాజమౌళిని.. సరకు అడుగుతాడు. చిన్న ముంతల్లో ఇస్తే.. తోసేసి ఇంకా పెద్దది అడుగుతాడు. దీన్నే కొంచెం మార్చి వీడియో రెడీ చేశారు ఫ్యాన్స్. రానా ప్రభాస్ ను హిట్టా.. బ్లాక్ బస్టరా అని అడుతాడు. దానికి ప్రభాస్.. ఇంకా పెద్దదే అడుగుదాం అంటూ రాజమౌళి దగ్గరికెళ్తాడు. హిట్టుందా అని అడుగుతాడు. రెండుసార్లు చిన్న ముంతల్లో ఇస్తే ఇంకా పెద్దది కావాలని అడుగుతాడు. తర్వాత రాజమౌళి ‘దమ్ముందా’ అంటాడు. దానికి ప్రభాస్.. ‘‘నువ్వెంత చూపెడితే.. అంత పెద్ద హిట్టు కొట్టే దమ్ముంది’’ అంటూ బదులిస్తాడు. ఈ వీడియోకు ‘బిగ్గర్ దెన్ ద బెస్ట్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో అభిమానుల్ని భలేగా అలరిస్తోంది.