Begin typing your search above and press return to search.

‘ది బిగినింగ్’ను.. ‘ది కంక్లూజన్’ను కలిపేసి..

By:  Tupaki Desk   |   24 May 2017 9:05 AM GMT
‘ది బిగినింగ్’ను.. ‘ది కంక్లూజన్’ను కలిపేసి..
X
‘బాహుబలి’ మొదలు పెట్టే ముందు దాన్ని ఒక్క సినిమాగా తీయాలనే అనుకున్నాడు రాజమౌళి. కానీ నిడివి ఎక్కువ అవుతుందనిపించడం వల్ల కావచ్చు.. ఒక సినిమాగా తీస్తే బడ్జెట్ వర్కవుట్ కాదన్న భయం కావచ్చు.. మొత్తానికి ఆ సినిమాను రెండు భాగాలుగా తీశారు. ఇది అద్భుత ఫలితాన్నిచ్చింది. ఐతే బాహుబలి ఒక సినిమాగా తీసి ఉంటే ఎలా ఉండేదో అన్న ఆలోచనా జనాల్లో లేకపోలేదు. ఆ ఆలోచననే నిజం చేయబోతోంది ‘బాహుబలి’ బృందం. ‘బాహుబలి’ రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి: ది బిగినింగ్’ను.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన ఎడిటర్ల సాయంతో దాదాపు 5 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న రెండు భాగాల్ని కలిపి రెండున్నర గంటల నిడివికి తగ్గించబోతున్నారట. ఈ వెర్షన్ ను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి.. దాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే ‘బాహుబలి’ రెండు భాగాలు విడుదలైన దేశాలతో పాటు మరిన్ని దేశాల్లో బాహుబలి ఇంగ్లిష్ వెర్షన్ రిలీజవుతుందని సమాచారం. ‘బాహుబలి: ది బిగినింగ్’ను గత ఏడాదే ఓ హాలీవుడ్ ఎడిటర్ సాయంతో ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. ఐతే అది ఇంగ్లిష్ వెర్షన్ కాదు. రెండు భాగాల్లోని పాటలతో పాటు అనవసరం అనుకున్న కొన్ని సన్నివేశాల్ని తీసేసి.. ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేయబోతున్నారు. ఈ ఏడాది ఇంగ్లిష్ ‘బాహుబలి’ విడుదలవుతుందట.