Begin typing your search above and press return to search.

నైజాంలో ఇదీ బాహుబలి లెక్క

By:  Tupaki Desk   |   27 Aug 2015 3:51 PM GMT
నైజాంలో ఇదీ బాహుబలి లెక్క
X
రాజమౌళి అన్నట్లు 50 రోజులు, వంద రోజుల సెంటర్ల రికార్డుల గురించి మాట్లాడే రోజులు పోయాయి. ఇప్పుడంతా కలెక్షన్ల రికార్డులే ప్రామాణికం. ఆ విషయంలో బాహుబలి బద్దలు కొట్టని రికార్డులేమీ లేవు. ఆ రికార్డుల గురించి మరే తెలుగు సినిమా కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. ఐతే కలెక్షన్ల విషయంలోనే కాక.. 50 రోజుల సెంటర్ల విషయంలోనూ బాహుబలి తన సత్తా చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా లెక్కలు తేలలేదు కానీ.. వందకు పైగా సెంటర్లలో బాహుబలి 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం విశేషం. ఈ రోజుల్లో ఓ సినిమా ఓ పది సెంటర్లలో 50 రోజులాడినా విశేషమే. అలాంటిది బాహుబలి 100 ప్లస్ సెంటర్లలో 50 రోజులు ఆడటం విశేషమే.

ఒక్క నైజాం ఏరియా వరకు బాహుబలి 35 సెంటర్లలో 50 డేస్ పూర్తి చేసుకుంది. ఇందులో డైరెక్టు సెంటర్లు 26 ఉండటం చాలా పెద్ద విశేషమే. హైదరాబాద్ వరకు నాలుగు సింగిల్ స్క్రీన్స్ లో డైరెక్ట్ 50 డేస్ ఆడింది బాహుబలి. షిఫ్ట్ తో ఇంకో మూడు థియేటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తయింది. ఇక మల్టీప్లెక్సుల్లోనూ బాహుబలి హవా సాగించింది. మొత్తం 10 మల్టీప్లెక్సుల్లో బాహుబలి 50 రోజులుగా ఆడుతుండటం విశేషం. ఐతే తొలి మూడు వారాలు షోస్ ఎక్కువున్నాయి కానీ.. ఇప్పుడు నంబర్ తగ్గింది. ఇప్పటికీ కొన్ని మెయిన్ సెంటర్లలో బాహుబలి మంచి షేర్ రాబడుతోంది. ఐతే 50 రోజుల తర్వాత కూడా బాహుబలిని కొనసాగించడానికి చాలా థియేటర్ల యజమానులు మొగ్గు చూపుతుండటం విశేషమే.
..