Begin typing your search above and press return to search.

బాహుబలి.. 87 రోజులు.. 302 కోట్లు..

By:  Tupaki Desk   |   7 Oct 2015 8:57 AM GMT
బాహుబలి.. 87 రోజులు.. 302 కోట్లు..
X
తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన లేటెస్టు మంత్రజాలం.. బాక్సాఫీస్‌ దగ్గర ఇంద్రజాలం చూపించడం మొదలై ఇప్పటికి ఒక 87 రోజులు అయ్యింది. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా చోట్ల రిలీజ్‌ అవుతూ ఉంటే.. కొన్ని చోట్ల ఇక బాక్సీఫీస్‌ దుఖాణం మూసేస్తున్నారు. ఓవరాల్‌ గా అసలు ఇప్పటివరకు రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం మాయ ఎలా ఉందంటే.. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలుపుకొని 302 కోట్లు షేర్‌ వచ్చేసింది.

జూలై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్‌ సినిమా.. కేవలం తెలుగు రాష్ట్రంలలోనే 114 కోట్ల రూపాయలను షుమారుగా వసూలు చేసింది. ఇండియా మొత్తం కలుపుకొని తెలుగు వర్షెన్‌ 153+ కోట్లు అర్జించింది. ఇక హిందీ, తమిళం, మలయాళం డబ్‌ వెర్షన్లను కలుపుకుంటే.. బాహుబలి పార్టు 1 మొత్తంగా ఇండియాలో 254+ కోట్ల షేర్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా వసూలు చేసిన సినిమా బాహుబలి అనే చెప్పాలి. ఎందుకంటే పీకె (170 కోట్లు) భజరంగీ భాయ్‌ జాన్‌ (160 కోట్లు) సినిమాలు బాహుబలి తరువాతే ఉన్నాయ్‌ మరి. కాకపోతే ఆ సినిమాలు కేవలం హిందీలో రిలీజ్‌ అవ్వగా.. మన మూవీ మాత్రం నాలుగు బాషల్లో వచ్చేసింది.

ఇకపోతే అమెరికా, కెనడా, మలేసియా మరియు ఇతర ఓవర్‌ సీస్‌ లొకేషన్లు అన్ని కలుపుకొని... అన్ని బాషల షేర్‌ కలుపుకుంటే.. బాహుబలి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 302 కోట్ల రూపాయల షుమారు షేర్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే 317 కోట్ల షేర్‌ తో వరల్డ్‌ వైడ్‌ పొజిషన్‌ లో పీకె సినిమా 1వ స్తానంలో ఉంటే.. బాహుబలి 2వ స్తానంలో.. 250 కోట్ల షేర్‌ తో భజరంగీ భాయ్‌ జాన్‌ 3వ స్తానంలో ఉన్నాయి. త్వరలోనే బాహుబలి జపాన్‌ లో కూడా రిలీజ్‌ అవుతోంది కాబట్టి.. చైనా ప్లస్‌ జపాన్‌ కలెక్షన్లను కలుపుకుంటే పీకె సినిమాకు ఎర్తింగ్‌ పెట్టేయడం ఖాయం.

తెలుగు వరకు వస్తే.. బాహుబలి గ్లోబల్‌ వసూళ్ళన్నీ కలుపుకొని మొత్తంగా 190 కోట్లు షేర్‌ వసూలు చేసింది. 84 సంవత్సరాల తెలుగు సినిమాల చరిత్రలో ఇదీ ఒక అద్భుతమే. అయితే ఇలాంటి అద్భుతాలు అని సినిమాల విషయంలో అస్తమానం జరగవులే. ఇప్పటికైతే బాహుబలి ప్రస్థానం ఇది. మరి వేరే దేశాల్లో రిలీజ్‌ అయ్యాక కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయ్‌.. 2వ పార్టయిన ''బాహుబలి: ది కంక్లూజన్‌'' హవా ఎలా సాగబోతోందో చూడాలిక..