Begin typing your search above and press return to search.

మోషన్ పోస్టర్... సాహోరే బాహుబలి!

By:  Tupaki Desk   |   23 Oct 2016 6:42 AM GMT
మోషన్ పోస్టర్... సాహోరే బాహుబలి!
X
భలి భలి భలిరా... సాహోరే బాహుబలి అంటూ వచ్చేసింది బాహుబలి - 2 మోషన్ పోస్టర్. ఓ చేతిలో గొలుసులు - మరో చేతిలో పొడవైన ఆయుధం - ఆజానుబాహ విగ్రహం - కళ్లలో మెరుపు - చూపులో చురుకు - నడకలో రాజసం వాటికి తోడు సిక్స్ ప్యాక్.. ఇవన్నీ కలగలిపి మహేంద్ర బాహుబలి ఈ రోజు అభిమానుల ముందుకు మోషన్ పొస్టర్ రూపంలో వచ్చేశాడు.. అభిమానులకు బర్త్ డే పార్టీ ఇచ్చేశాడు.

సినిమా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనాలో కళ్లు కాయలు కాచేటట్లు ఆశగా చూస్తున్నారో అనాలో... వీటిలో ఏ వాక్యాలు వాడినా తక్కువే... అదే "బాహుబలి -ది కన్‌క్లూజన్‌". తెలుగుసినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన బాహుబలి సీక్వెల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వచ్చేసింది. ఆ పోస్టర్ లో యంగ్ రెబల్ స్టర ఆహార్యం ఆన్ లైన్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇదే క్రమంలో ఆ హీట్ ను మరింతగా కొనసాగించడానికన్నట్లు ఈ సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

యంగ్ రెబల్ స్టార్ జన్మదినం సందర్భంగా విడుదలయిన ఈ మోషన్ పోస్టర్ అభిమానులకు ది బిగినింగ్ అందించిన అద్భుతాలను మించి మించి మరెన్ని అద్భుతాలను మించి మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించబోతోందని ఇట్టే అర్ధమవుతోంది. ఈ పోస్టర్ లో ప్రాభాస్ లుక్ ఒకెత్తు అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకెత్తు. ఈ సినిమా ఎప్పుడెప్పుదు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడూ చూసేద్ధామా అనేస్థాయి ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ఈ మోషన్ పోస్టర్ అనండంలో సందేహం ఏమాత్రం లేదనే చెప్పాలి.

ఇక "ప్రతీ కథకు కీలకంగా సింగిల్ పాయింట్ ఉంటుంది.. అదే మొత్తం కథను బాహుబలి ది బిగినింగ్ ను నడిపిస్తుంది" అంటూ బాహుబలి ది బిగినింగ్ కి ఫస్ట్ లుక్ ఇచ్చేముందు ఒకే ఒక్క ట్వీట్ తో దాని స్దాయి ఏంటో చెప్పిన జక్కన్న... బాహుబలి2 ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందు కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. "తన ఎదురులేని శక్తిని ఉపయోగించి మాహిష్మతి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడన్నదే బాహుబలి - 2 ది కంక్లూజన్" అంటూ ఒకే వాక్యంలో సీక్వెల్ గురించి చెప్పాడు.

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ "బాహుబలి 2"లో ప్రభాస్‌ లుక్‌ ని ఆవిష్కరించి అభిమానులకు పండగ చేసింది. కాగా ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిన సమయంలో ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌ లుక్‌ ను, దానితో పాటు దుమ్ములేపే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మోషన్ పోస్టర్ ను గ్రాండ్‌ గా ఏర్పాటుచేసిన ఈవెంట్‌ లో విడుదల చేశారు.