Begin typing your search above and press return to search.

అఫీషియల్: రెండో బాహుబలి 2.47 గంటలు

By:  Tupaki Desk   |   21 April 2017 12:00 PM GMT
అఫీషియల్: రెండో బాహుబలి 2.47 గంటలు
X
‘బాహుబలి’ ఒక సినిమాగా తీస్తే నాలుగు గంటల కంటే ఎక్కువ నిడివి వస్తోందని.. అందుకే రెండు భాగాలు చేస్తున్నామని అన్నాడు రాజమౌళి. ఒక భాగమే రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న నేపథ్యంలో రెండో భాగం నిడివి మరీ ఎక్కువేమీ ఉండదనుకున్నారంతా. ఆ మధ్య ‘బాహుబలి: ది కంక్లూజన్’ లెంగ్త్.. 2 గంటలకు కొంచెం ఎక్కువ మాత్రమే అన్న ప్రచారం జరిగింది. అది ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. తొలి భాగానికి దీటుగా రెండో భాగం లెంగ్త్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జక్కన్న అండ్ కో ప్రేక్షకుల్నినిరాశకు గురి చేయట్లేదు. బాహుబలి-2 నిడివి తొలి భాగం కంటే ఎక్కువ ఉండబోతోంది.

కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ‘ది కంక్లూజన్’ లెంగ్త్ 2 గంటల 47 నిమిషాలు ఉండబోతోందని అధికారికంగా వెల్లడైంది. బాహుబలి-2 సెన్సార్ డీటైల్స్ ను నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి కూడా ధ్రువీకరించారు. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో మాత్రమే స్క్రీన్ల సంఖ్య 7-8 వేల మధ్య ఉండే అవకాశముంది. ముందు అనుకున్న దాని కంటే థియేటర్ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అమెరికా-కెనడాల వరకే ఈ చిత్రాన్ని 1000కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/