Begin typing your search above and press return to search.

అమెరికా టాక్: దిగొచ్చిన బాహుబలి-2

By:  Tupaki Desk   |   27 April 2017 7:37 AM GMT
అమెరికా టాక్: దిగొచ్చిన బాహుబలి-2
X
బాహుబలి ది బిగినింగ్ సాధించిన ఘనవిజయాన్ని బేస్ చేసుకుని.. ఆ సినిమా సాధించిన వసూళ్లకు మించిన రేట్లకు బాహుబలి2 రైట్స్ విక్రయించారు. ఇది డిస్ట్రిబ్యూటర్లను తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఒక్క అమెరికాలోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తే తప్ప ఈ మూవీ సేఫ్ జోన్ లోకి రాదంటే.. ఏ స్థాయి రేట్లకు రెండో భాగాన్ని అమ్మారో అర్ధమవుతుంది.

మరి ఇంత మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు భారీగా టికెట్ రేట్లు పెట్టి దండుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఒక్కో టికెట్ ను 30 డాలర్లకు పైగా రేట్ పెట్టి విక్రయిస్తుండడంతో.. కెనడా వాసులు షాక్ ఇచ్చారు. అధిక ధరల కారణంగా ఒట్టావా తెలుగు కమ్యూనిటీ జనాలు బాహుబలి2ని బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పడంతో.. ఇప్పుడు లోకల్ డిస్ట్రిబ్యూటర్ దిగిరాక తప్పలేదు. ఇప్పుడిక్కడ 12.25 యూఎస్ డాలర్లకే బాహుబలి2ని విక్రయిస్తున్నారు.

నిజానికి బాలీవుడ్ తో పాటు.. హాలీవుడ్ సినిమాల టికెట్లు 10 డాలర్ల లోపే ఉంటాయి. కానీ తెలుగు సినిమాలపై జనాలకు ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు భారీ రేట్లకు టికెట్లు విక్రయించడం కామన్ గా మారిపోయింది. ఇప్పుడు ఒట్టావాలో బాహుబలి టికెట్స్ విషయంలో జనాల ఐక్యత.. చాలా చోట్ల రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/