Begin typing your search above and press return to search.

బాహుబలి టీజర్.. అసలుందా లేదా?

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:49 AM GMT
బాహుబలి టీజర్.. అసలుందా లేదా?
X
ఇదిగో అదిగో అంటున్నారు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ టీజర్ మాత్రం రావట్లేదు. ఇప్పటికే రెండుసార్లు ‘కంక్లూజన్’ టీజర్ వచ్చేస్తున్నట్లే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేకపోయింది. మహాశివరాత్రి కానుకగా టీజర్ పక్కా అన్నారు. కానీ ఆ రోజు రానే వచ్చింది. కానీ టీజర్ మాత్రం రాలేదు. ఇప్పుడు మార్చి 4 లేదా 5 తారీఖుల్లో టీజర్ లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే టీజర్ గురించి ‘బాహుబలి’ టీం మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. దీంతో అసలు నిజంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం టీజర్ తయారు చేస్తున్నారా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘బాహుబలి: ది బిగినింగ్’కు టీజర్ లాంటిదేమీ లేదు. నేరుగా ట్రైలరే లాంచ్ చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. ఐతే ‘ది బిగినింగ్’ విషయంలో టీజర్ రెడీ చేసేంత ఖాళీ లేకపోయిందని.. ‘ది కంక్లూజన్’ విషయంలో అంతా పక్కాగా జరుగుతుండటంతో టీజర్ తో ముందు పలకరించి.. ఆ తర్వాత ట్రైలర్ వదలాలని రాజమౌళి భావించాడని యూనిట్ వర్గాల సమాచారం. ఒక వేళ టీజర్ రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం మార్చి ప్రథమార్ధంలోనే ఆ పని కానిచ్చేస్తే బెటర్. ఎందుకంటే ఏప్రిల్ 28కే సినిమా వచ్చేస్తోంది. మళ్లీ ట్రైలర్ లాంచ్.. ఆడియో లాంచ్ వగైరా ప్రమోషన్లు చాలా ఉంటాయి కాబట్టి త్వరగా టీజర్ వదిలేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/