Begin typing your search above and press return to search.

జ‌పాన్ కు బ‌హుబ‌లి 2 రెఢీ.. చైనాకు మాత్రం?

By:  Tupaki Desk   |   3 May 2017 1:33 PM GMT
జ‌పాన్ కు బ‌హుబ‌లి 2 రెఢీ.. చైనాకు మాత్రం?
X
భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన బాహుబ‌లి 2.. ఊహించిన‌ట్లు విజ‌య‌వంతంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌లైన అన్ని ఏరియాలోనూ భారీ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో.. ఈ విజ‌య‌యాత్ర‌ను మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించాల‌ని భావిస్తున్నారు బాహుబ‌లి నిర్మాత‌లు.

ఇందులో భాగంగా త్వ‌ర‌లో జ‌పాన్ లో విడుద‌ల‌కు సిద్దం చేస్తున్నారు. ఉంటే.. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇదిలా బాహుబ‌లి 2ను చైనీస్ లో విడుద‌ల చేయ‌టానికి మాత్రం నిర్మాత‌లు జంకుతున్న‌ట్లుగా చెబుతున్నారు. అంద‌రిని మెప్పించిన బాహుబ‌లి.. చైనీయుల్ని మాత్రం ఆక‌ట్టుకోలేద‌ని చెబుతారు.

మొద‌టిభాగం విజ‌య‌వంతం అయ్యాక‌.. చైనా నుంచి ప్ర‌త్యేకంగా నిపుణుల్ని తెప్పించి మ‌రీ.. ప్ర‌త్యేకంగా డ‌బ్ చేయించి మ‌రీ విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో అక్క‌డ విఫ‌ల‌మైంది. దీంతో.. ఈసారి కూడా అదే ట్రెండ్ సాగితే ఇబ్బంది అవుతుంద‌న్న భావ‌న‌లో నిర్మాత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మొదటి భాగాన్ని చైనాలో విడుద‌ల చేసే స‌మ‌యంలో.. అక్క‌డి రైట్స్ ను సొంతం చేసుకున్న ఇ-స్టార్ సంస్థ భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. ఏన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం.. అక్క‌డి వారిని ఆక‌ట్టుకోక‌పోవ‌టంతో.. రెండో భాగంలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంటే ఇబ్బంది అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కార‌ణంతోనే మొద‌టి భాగాన్ని విడుద‌ల చేసిన సంస్థ‌.. బాహుబ‌లి 2 హ‌క్కులు తీసుకునేందుకు ముందుకు రాలేద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైనాలో అమీర్ ఖాన్ హ‌వా న‌డుస్తోంది. అమీర్ న‌టించిన‌ పీకేను విడుద‌ల చేయ‌గా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకుంది. త్వ‌ర‌లో దంగ‌ల్‌ ను చైనాలో విడుద‌ల చేయ‌నున్నారు. అమీర్ చిత్రాల్ని ఆద‌రించే చైనీయులు బాహుబ‌లిని ఎందుకు ఆద‌రించ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. చైనీయులు కానీ బాహుబ‌లిని ఓ మోస్త‌రు ఆద‌రించినా రూ.100కోట్ల క‌లెక్ష‌న్లు ఖాయ‌మ‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమాను కొనేందుకే ముందుకు రాని వేళ‌... క‌లెక్ష‌న్ల గురించి మాట్లాడుకోవ‌టంలో అర్థం లేదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/