Begin typing your search above and press return to search.

డాలర్లలో కూడా బాహుబలి బాదుడే

By:  Tupaki Desk   |   24 April 2017 6:27 PM GMT
డాలర్లలో కూడా బాహుబలి బాదుడే
X
దేశంలో మచ్ అవైటెడ్ మూవీ అనే విషయం అర్ధం కాగానే.. బాహుబలి ది కంక్లూజన్ నిర్మాతలు ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో భారీ బాదుడు జనాల జేబులకు చిల్లులు పెట్టే కార్యక్రమం బాగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను 200 రూపాయలకు పెంచుకుందామన్న బాహుబలి మేకర్స్ ఆలోచన బెడిసికొట్టింది. అయినాసరే రోజుకు 6 షోలు వేసి ఎక్కువ రేటుకే టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు.

ఇకపోతే అమెరికాలో మాత్రం ఈ జేబులు గుల్ల చేసే కార్యక్రమానికి పెద్ద రేంజులో తెరలేపారు. బాహుబలి టికెట్స్ ను వారం పది రోజుల ముందు నుంచే విక్రయించేస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు తాము బుక్ చేసుకున్న టికెట్స్ ను ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు కూడా. అయితే.. వీటిని గమనిస్తే.. ఒక్కో టికెట్ ధర 33 యూఎస్ డాలర్లు అనే విషయం అర్ధమవుతుంది. సహజంగా యూఎస్ లో ఒక్కో టికెట్ ధర 8 నుంచి 12 డాలర్లు ఉంటుంది. ప్రీమియర్లకు మాత్రం 20 డాలర్లు.. గరిష్టంగా 25 డాలర్లు వసూలు చేస్తుంటారు. కానీ బాహుబలికి మాత్రం 33 డాలర్లు పెట్టడమే కాదు.. వీటిని కూడా పూర్తిగా బ్లాక్ చేసేసి మళ్లీ వాటిని రిటైల్ గా క్యాష్ చేసుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనాల్లో ఉన్న ఈ క్రేజ్ ని ఇంతలా క్యాష్ చేసుకోవడాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

చూస్తుంటే బాహుబలి మేకర్లకు కాని.. డిస్ర్టిబ్యూటర్లకు కాని.. కేవలం 1 వారంలోనే వసూళ్లు తెచ్చేసుకోవాలి అనే తహ తహ ఏ రేంజులో ఉందో మనం అర్దం చేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/