Begin typing your search above and press return to search.

బాహుబలి2 ఎక్కడ లీకైందో?

By:  Tupaki Desk   |   26 April 2017 6:56 AM GMT
బాహుబలి2 ఎక్కడ లీకైందో?
X
బాహుబలి 2 విడుదలకి 2 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడీ సినిమాకి లీకుల బెడద మొదలైపోయింది. నెట్లో హల్ చల్ చేస్తున్న ఇమేజ్ లు చూస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. బాహుబలి2 మూవీ నుంచి లీక్డ్ ఫోటోలు చూసి కోట్లాది మంది సినీ అభిమానులు ఒకసారిగా షాక్ తిన్నారు. ఇంత వరుకు ఎక్కడా బాహుబలి 2 స్క్రీనింగ్ కానపుడు.. ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందని మేకర్స్ టెన్షన్ పడుతున్నారు.

సెన్సార్ చేసినపుడే ఈ మూవీ లీక్ అయి ఉంటుందని.. అక్కడి వ్యక్తుల నిర్వాకమే ఇదని ఇండస్ట్రీ జనాలు కొందరు అనుకుంటున్నారు. సెన్సార్ నుంచే ఈ లీక్ జరిగిందని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం బాహుబలి టీమ్ ప్రసాద్ లో సినిమా చూశారని.. ఇంటర్నేషనల్ మార్కెట్ కోసమే ఈ ఇమేజ్ లను యూనిట్ సభ్యులే లీక్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం బాహుబలి పై ఉన్న హైప్ చూస్తే ఇది నమ్మేలా లేదు. సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న యూనిట్.. ఇప్పుడీ లీకుల బెడద పెద్ద ప్రశ్నగా పరిణమించింది. ఇప్పుడు బాహుబలి టీమ్ మూవీ స్క్రీనింగ్ విషయంలో మరింత సెక్యూరిటి మెజర్స్ పాటిస్తున్నారు.

బాహుబలి ది కంక్లూజన్ ఈ నెల 28న విడుదలకు రంగం సిద్దమైంది. మొదటి వారం రోజుల పాటు ఏపీలో రోజూ 6 ఆటలు ప్రదర్శించేందుకు.. తెలంగాణలో 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి రావడంతో.. కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు నమోదు కానున్నాయని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/