Begin typing your search above and press return to search.

రికార్డ్ః బాహుబలి 2 ఫస్ట్ డే.. 121 కోట్లు

By:  Tupaki Desk   |   29 April 2017 4:50 PM GMT
రికార్డ్ః బాహుబలి 2 ఫస్ట్ డే.. 121 కోట్లు
X
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 121+ కోట్లు వసూలు చేసింది ''బాహుబలి 2''. అంతా భారీగా రిలీజైన సినిమాకు ఈ కలక్షన్లు పెద్ద విషయం కాదులే కాని.. కాకపోతే ఇవే ఇప్పుడు రికార్డులను తారుమారు చేసిన అంకెలు అయిపోయాయ్. భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘనంగా తొలిరోజు వసూళ్ళు సాధించిన సినిమాగా బాహుబలి 2 ఇప్పుడు చరిత్ర రాసేసింది. సినిమా ఎలా ఉన్నా సరే.. సెకండాఫ్‌ కొందరికి నచ్చకపోయినా సరే.. రిలీజుకు ముందు ఉన్న హైప్ అంతా ఇప్పుడు అదరిపోయే కలక్షన్లకు దారితీసింది.

ఆల్రెడీ బాహుబలి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 42+ కోట్ల షేర్ తొలిరోజునే వసూలు చేసిందని చెప్పుకున్నాం. ఇకపోతే ఇతర రీజియన్లలో ఫస్ట్ డే కలక్షన్లు (షేర్) ఎలా ఉన్నాయంటే.. కర్ణాటకలో 10 కోట్లు.. తమిళనాడులో 6 కోట్లు.. కేరళలో 2.75 కోట్లు.. బాలీవుడ్ మరియు ఇతర ప్రాంతాల్లో మరో 22 కోట్లు వసూలు చేసింది బాహుబలి 2. మొత్తంగా ఇండియాలో 90 కోట్ల వరకు రాగా.. అమెరికాలో 19.5 కోట్లు.. ఎమిరేట్స్ నుండి 9 కోట్లు.. తక్కిన రీజియన్స్ నుండి 7.5+ కోట్లు షేర్ వసూలు చేసిందీ చిత్రం. ఆ విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలుపుకుని 121+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఇది రికార్డులకే రికార్డ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/