Begin typing your search above and press return to search.

బాహుబలి ఇంటర్వెల్: ఏంటో ఈ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   3 May 2017 1:12 PM GMT
బాహుబలి ఇంటర్వెల్: ఏంటో ఈ ఫ్యాన్స్
X
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ ఎలా రాశారు మాష్టారూ? అని రచయిత విజయేంద్ర ప్రసాద్ ను అడిగితే.. అదిగోండి ఒక ఫంక్షన్లో పవన్ కళ్యాణ్‌ పేరు చెప్పగానే జనాలు అరిచేశారు.. అది చూసి ఆ సీన్ రాశాను అని చెప్పారు. ఇప్పుడేమో ఎన్టీఆర్ అభిమానులు కొందరు అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ఈవెంట్లో హరికృష్ణ ప్రసంగం వీడియో వేసి.. అదిగో అక్కడ కూడా జూ.ఎన్టీఆర్ పేరు రాగానే జనాలు అరుస్తున్నారు కాబట్టి.. ఇది కూడా బాహుబలి 2 ఇంటర్వెల్ అనేసి ప్రచారం స్టార్ట్ చేశారు. టూ మచ్ కదండీ ఇదీ.

సాధారణంగా ఏ పెద్ద హీరో ఫంక్షన్లో అయినా కూడా.. ఎవరో ఒక ఫేవరేట్ హీరో గురించి చెబితే.. ఖచ్చితంగా అరుపులు వినిపిస్తాయి. అలా అరిచే వారినే ఫ్యాన్స్ అంటారు. మెగా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్‌ పేరు చెప్పగానే ఎలా అరుస్తారో.. కొన్ని నందమూరి ఫంక్షన్లలో బాలయ్య పేరు చెబితే అదే విధంగా అరుస్తారు. అలాగే తమిళనాడు వెళ్ళి తలైవా అంటే కేకలు పెట్టేస్తారు తంబీలు. ఒక పెద్ద ఆడిటోరియంలో షకీరా లేదా ఎడ్ షీరన్ వంటి సింగర్లు వచ్చి యాయాయాయ అని అరిచినా కూడా జనాలు చెవులు కోసుకుంటారు. ఇక పొలిటికల్ మీటింగుల్లో కూడా ఇలాంటి వీలలు అరుపులు సహజం. అందుకని ఇలాంటివన్నీ ఇప్పుడు బాహుబలి 2 సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను తలిపిస్తున్నాయ్ అంటే ఎలా? రైటర్ విజయేంద్రప్రసాద్ ఏదో సెన్సేషన్ కోసం పవన్ కళ్యాణ్‌ ను చూసి రాశాను అని చెబితే.. ఇక జనాలు ప్రతీ హీరోను అందుకు ఈక్వేట్ చేసి నానా రచ్చ చేస్తున్నారు.

అలనాడు హిట్లర్ ప్రసంగిస్తున్నప్పుడు కూడా నాజీలు అందరూ ఉర్రూతలూగిపోయేవారు. లిబియా మోనార్క్ కల్నల్ గడాఫి మాట్లాడితే ఆయన అనుచరులు హాహాకారాలు చేసేవారు. చివరకు బిన్ లాడెన్ ప్రసంగాలు విని కూడా చాలామంది అరుస్తారు. జకీర్ నాయక్ మాటలకు కూడా చప్పట్లు వీలలు పడుతుంటాయి. అందుకని వీళ్ళని కూడా బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కు ప్రేరణ ఇచ్చారు అంటామా? ఆపండయ్యా బాబూ!!




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/