Begin typing your search above and press return to search.

బాహుబలి2కి బాలీవుడ్ సాహో

By:  Tupaki Desk   |   30 April 2017 10:26 AM GMT
బాహుబలి2కి బాలీవుడ్ సాహో
X
బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించలేనన్ని ఓపెనింగ్స్ ను బాహుబలి2 వసూలు చేయడం.. అక్కడి ఇండస్ట్రీ జనాలకు షాక్ కలిగించే విషయమే. దీన్నే జీర్ణించుకోలేకపోయిన బాలీవుడ్ ట్రేడ్ జనాలకు.. రెండో రోజు వసూళ్లు మైండ్ బ్లాంక్ చేసేశాయి.

తొలి రోజున 41 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన బాహుబలి ది కంక్లూజన్.. రెండో రోజున కూడా 40 కోట్లు రాబట్టేసింది. అంటే.. రెండో రోజుకు ఏ మాత్రం డ్రాప్స్ లేవన్న మాట. రెండో రోజు 40 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా బాహుబలి2(హిందీ వెర్షన్ కు మాత్రమే) నిలిచింది. అంతే కాదు.. వసూళ్లలో డ్రాప్స్ లేకపోవడాన్ని కూడా కొత్త చరిత్రగానే చెప్పాలి. ఇప్పడు తొలి రెండు రోజులకు బాహుబలి2 85 కోట్ల రూపాయల వసూళ్లను దాటేసి.. అత్యంత వేగంగా 100 కోట్లను కొల్లగొట్టిన రికార్డ్ సృష్టించబోతోంది. ఇప్పటివరకూ సుల్తాన్ మాత్రమే తొలి వీకెండ్ కు 105 కోట్లను వసూలు చేయగలిగింది.

ఇప్పుడు బాహుబలి2 వీకెండ్ ముగిసేసరికి సుల్తాన్ రికార్డ్ ను దాటేయడం ఖాయం. మరోవైపు.. అన్ని వెర్షన్స్ కు కలిపి తొలి వీకెండ్ నాటికే 500 కోట్ల గ్రాస్ ను బాహుబలి2 రాబడుతుందని అంటున్నారు. లైఫ్ టైంలో మరో 500 కోట్లు వసూలు చేయడం కూడా సాధ్యమే. ఇండియాలో తొలి 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన మూవీగా బాహుబలి ది కంక్లూజన్ సెన్సేషనల్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/