Begin typing your search above and press return to search.

బాహుబలి-2.. ఇంకో 22 కోట్లు వస్తే!

By:  Tupaki Desk   |   22 May 2017 10:59 AM GMT
బాహుబలి-2.. ఇంకో 22 కోట్లు వస్తే!
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ కలెక్షన్ల గురించి తొలి రోజు నుంచి కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. ఈ ముచ్చట్లు ఇప్పటికీ ఆగలేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక కొత్త మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోందీ సినిమా. తెలుగులో మాత్రమే కాదు.. హిందీ.. తమిళం.. మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది.

హిందీ వెర్షన్ ఇప్పటికే బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో ఇండియాలోనే ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న ‘దంగల్’ దేశవ్యాప్తంగా రూ.375 కోట్లు కొల్లగొడితే.. బాహుబలి-2 దాని కన్నా వంద కోట్లు ఎక్కువే వసూలు చేసింది. నాలుగో వారాంతం ముగిసేసరికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.478 కోట్లకు చేరుకోవడం విశేషం. ఇంకో రూ.22 కోట్లు వసూలు చేస్తే.. రూ.500 కోట్ల మైలురాయిని టచ్ చేస్తుంది ‘బాహుబలి-2’.

ఐతే ఈ శుక్రవారం విడుదలైన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు నెగెటివ్ టాక్‌ వచ్చినప్పటికీ రూ.32 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ప్రభావం ‘బాహుబలి-2’పై పడింది. దీంతో మూడో వారాంతంలో రూ.70 కోట్ల దాకా గ్రాస్ సాధించిన బాహుబలి-2.. ఈ వారాంతంలో రూ.18.3 కోట్లకు పరిమితమైంది. ఐతే ఫుల్ రన్లో అతి కష్టం మీద అయినా బాహుబలి-2 రూ.500 కోట్ల మైలురాయిని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.